(December 12)The great man who brought Vemana poems to light - CP Brown

 The great man who brought Vemana poems to light - CP Brown

వేమన పద్యాలను వెలుగులోకి తెచ్చిన మహనీయుడు - సి పి బ్రౌన్

The great man who brought Vemana poems to light - CP Brown

తెలుగు వారికి ఎనలేని సేవలు అందించినసర్ ఆర్థర్ కాటన్  వంటివారితోబాటు తెలుగువారు అత్యంత  ప్రేమాభిమానాలతో  గుర్తుంచుకోవలసిన మహామనీషి బ్రౌన్ . 800 సంవత్సరాల పైగా ఘన చరిత్ర కలిగిన ఈ  తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తించి సామాన్య ప్రజానీకానికి ఇంకా ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఒక విదేశీయునికి చెందడం ఆశ్చర్యమే అయినా ఆనందదాయకం కూడా!  

1817, ఆగస్ట్‌ 1 న ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి ఓడ ఒకటి బయల్దేరింది. దాని పేరు కర్ణాటక్‌. వందలాది ప్రయాణికులున్నారు అందులో. ఆ వందల్లో ఓ అనామకుడు. 19 ఏళ్లవాడు. పేరు.. ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. భవిష్యత్తులో మరణశయ్యపై ఉన్న తెలుగు సాహిత్యాన్ని.. శాస్త్రీయత అనే గంగతో బతికించే సాహితీ భగీరథుడు. 'కానీ ఆ ఓడ ఎక్కేటప్పుడు అసలు 'తెలుగు' అనే మూడక్షరాల మాట విన్లేదు' అంటాడతను నిజాయతీగా. కానీ అతని జీవితం మొత్తాన్ని ఆ మూడు అక్షరాలే శాసించాయి. అతని మాటల్లో చెప్పాలంటే 'పిచ్చెక్కించాయి'. అతని వూపిరున్నంత వరకు వూడిగం చేయించుకున్నాయి!

తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు (నవంబర్ 10, 1798 ). బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. 

తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు. వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు.

12 డిసెంబర్‌ 1884న అవివాహితుడిగానే తన 87వ యేట లండన్‌లోనే కన్ను మూశారు. కుటుంబం - సంసారం వంటి బంధనాల్లో ఇరుక్కోకుండా స్వేచ్ఛగా తెలుగు భాషా సాహిత్యాలకు, తెలుగు ప్రజలకు తనను తాను అర్పించుకున్న మహనీయుడు ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌!

డాక్టర్‌ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి కడపలో బ్రౌన్‌ స్మారక గ్రంథాలయం నెలకొల్పారు. బ్రౌన్‌ జీవితం - సాహిత్య కృషి గురించి పరిశోధించి, విషయాలు తరువాతి తరాలవారికి అందించారు. జానుమద్దిగారితో గతంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, కొన్ని సాహిత్య సభల్లో ఆయన్ని కలుసుకోగలగడం మరువలేని జ్ఞాపకాలు! బ్రౌన్‌ను తనలో ఆవహింపజేసుకున్నవాడిగా ఆయన కనబడేవారు. అందుకే ఆయనను తెలుగు సూర్యుడు అని పిలుస్తారు.

ప్రతి రంగంలోనూ త్యాగధనులు ఉంటారు. వారి కృషిని కనీసం స్మరించుకోవడం మనుష్యులైన వారి కనీస కర్తవ్యం. తన 86  సంవత్సరాలలో 60 సంవత్సరాలు తెలుగు భాషాభివృద్ధికి అంకితం చేసిన బ్రౌన్ ని సంస్మరించుకోవడం తెలుగు వారందరి విధి.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.