(October 2)Shastri's death is still a mystery. Former Prime Minister Lal Bahadur Shastri's 55th birth anniversary today.

 Shastri's death is still a mystery. Former Prime Minister Lal Bahadur Shastri's 55th birth anniversary today.

శాస్త్రి మరణం నేటికీ మిస్టరీనే. మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి 55వ వర్ధంతి నేడు.

Shastri's death is still a mystery. Former Prime Minister Lal Bahadur Shastri's 55th birth anniversary today.

భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన దేశభక్తుల్లో ప్రముఖుడు మనం మరచిన మహా నేత మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి వర్ధంతి నేడు.

ఆయన మరణించి ఐదు దశాబ్దాలకు పైగా అయ్యింది. 1902 అక్టోబర్ 2 న జన్మించిన శాస్త్రి చివరి శ్వాస వరకు దేశానికి అంకితం చేసిన గొప్ప దేశ భక్తుడు.

భారత ప్రధానుల్లో లాల్ బహదూర్ శాస్త్రిది భిన్నమైన శైలి. భారతదేశానికి రెండో ప్రధానిగా కొంతకాలమే పనిచేసినా ఆయన భారతీయ యవనికపై తనదైన ముద్ర వేశారు.. ఇక లాల్ బహదూర్ శాస్త్రి ఔన్నత్యం గురించి ఎన్ని సంఘటనలు గుర్తు చేసుకున్నా ఇంకొకటి ఉందేమో అనిపిస్తుంది అంతటి వ్యక్తిత్వం ఆయన సొంతం..జై జవాన్, జై కిసాన్’ నినాదం ఇచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి 1966 జనవరి 11న మరణించారు. క్లీన్ ఇమేజ్, సింప్లిసిటీకి పేరుగాంచిన లాల్ బహదూర్ శాస్త్రి మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మరణం తర్వాత 9 జూన్ 1964న ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. దాదాపు 18 నెలల పాటు దేశ ప్రధానిగా ఉన్నారు.

లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వంలో, 1965 యుద్ధంలో భారతదేశం పాకిస్తాన్‌ను ఓడించింది. 1965 లో ఇండో-పాక్ యుద్ధం తరువాత, జనవరి 10, 1966 న, శాస్త్రిజీ పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి తాష్కెంట్ కు వెళ్లారు. అక్కడ సమావేశం జరిగిన కొన్ని గంటల తర్వాత ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 11 జనవరి 1966 రాత్రి రహస్య పరిస్థితుల్లో మరణించారు. పాకిస్థాన్ కోసం సంధికోసం విదేశాలకు వెళ్లిన లాల్ బహదూర్ శాస్త్రి మరణం చుట్టు అనేక కుట్రలు ఉన్నాయి..ఇప్పటికీ డెత్ మిస్టరీ వెలుగులోకి రాలేదు.

యావత్ భారతదేశం ఎప్పటికి గుర్తించుకోవాల్సిన ఒక ఆదర్శ మూర్తిని, మహానేత, గొప్ప దేశ దేశభక్తుడు లాల్ బహాదుర్ శాస్త్రి గారు. అయితే భారత మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణించి 55 ఏళ్ళు అయినా ఇప్పటికీ ఆయన మృతిపై ముసురుకున్న అనుమానాలకు తెరపడలేదు. లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక CIA హస్తం ఉందని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్కమైన భారతరత్న పురస్కారాన్ని ప్రభుత్వం 1966  ప్రకటించింది

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.