Tata Punch EV: 421 km travel on a single charge.. New electric car from Tata.

Tata Punch EV: 421 km travel on a single charge.. New electric car from Tata.

Tata Punch EV: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 421 కి.మీ ప్రయాణం.. టాటా నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..

Tata Punch EV: 421 km travel on a single charge.. New electric car from Tata.

Tata Punch EV: టాటా పంచ్ ఎడిషన్‌కు ఈవీని పరిచయం చేసింది. నెక్సాన్ EV తర్వాత టాటా మోటార్స్ నుంచి వచ్చిన రెండవ ఎలక్ట్రిక్ SUVగా ‘పంచ్ EV’ నిలుస్తోంది.

Tata Punch EV: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 421 కి.మీ ప్రయాణం.. టాటా నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata motors) ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ మార్కెట్‌లో దూసుకెళ్తోంది. డిమాండ్‌కు తగినట్లు ఎలక్ట్రిక్ కార్లు తీసుకొస్తోంది. 2020లో నెక్సాన్ EVని పరిచయం చేసి, ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించింది. తాజాగా టాటా పంచ్ మోడల్‌కు ఈవీ ఎడిషన్‌ను పరిచయం చేసింది. నెక్సాన్ EV తర్వాత టాటా మోటార్స్ నుంచి వచ్చిన రెండవ ఎలక్ట్రిక్ SUVగా ‘పంచ్ EV’ నిలుస్తోంది.

పంచ్ EV కొత్త తరం EV ప్లాట్‌ఫామ్‌ Acti.evపై రూపొందింది. ఇది బెస్ట్ పర్ఫామెన్స్, ఎఫిషియన్సీ సేఫ్టీ అందిస్తుంది. పంచ్ EV విభిన్న బ్యాటరీ కేపబిలిటీస్, పవర్ ఔట్‌పుట్లతో స్టాండర్డ్ రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్లలో వస్తుంది. స్టాండర్డ్ రేంజ్ వేరియంట్‌లో 25kWh బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది సింగిల్ ఛార్జ్‌పై 315 కిమీ రేంజ్ అందిస్తుంది, ఇందులోని మోటార్ 82 bhp, 114 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు.

లాంగ్ రేంజ్ వేరియంట్‌లో 35kWh బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది సింగిల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇందులో 122 bhp, 190 Nm టార్క్ ఉత్పత్తి చేయగల మోటారు అందించారు. రెండు వేరియంట్లు AC, DC ఛార్జింగ్ ఆప్షన్స్‌కు సపోర్ట్ చేస్తాయి. DC ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ 50kW ఛార్జర్‌ని ఉపయోగించి 56 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు బ్యాటరీని ఛార్జ్ చేయగలదు.

ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి పంచ్ EV అనేక ప్రీమియం ఫీచర్లు, సౌకర్యాలను కూడా అందిస్తుంది. పంచ్ EV లోపలి భాగంలో లెథెరెట్ సీట్లు, ఫ్రంట్-సీట్ వెంటిలేషన్, ఎయిర్ ప్యూరిఫైయర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో వైర్‌లెస్ కనెక్టివిటీకి, అలాగే స్మార్ట్‌ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. పంచ్ EV మెరుగైన విజిబిలిటీ, పార్కింగ్ అసిస్టెంట్ కోసం 360-డిగ్రీ కెమెరాను ఆఫర్ చేస్తుంది. ఇంజన్ సాధారణంగా ఉండే హుడ్ కింద స్టోరేజ్ స్పేస్ అయిన ఫ్రాంక్‌ ఉంటుంది. పంచ్ EV ఎక్స్‌ట్రా లగ్జరీ కోసం ఆప్షనల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో కూడా వస్తుంది.

పంచ్ EV స్టాండర్డ్ రేంజ్ వేరియంట్ ధరలు రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి, లాంగ్ రేంజ్ టాప్ వేరియంట్ రూ.14.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ధర కలిగి ఉంటుంది. పంచ్ EV కోసం బుకింగ్‌లు ఓపెన్ అయి ఉంటాయి, యూజర్లు రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి కారు రిజర్వ్ చేసుకోవచ్చు.

స్మార్ట్ వేరియంట్ ధర రూ.10.99 లక్షలు, స్మార్ట్+ వేరియంట్ ధర రూ.11.49 లక్షలు, అడ్వెంచర్ వేరియంట్ ధర రూ.11.99 లక్షలు, ఎమ్‌పవర్డ్‌ వేరియంట్ ధర రూ.12.79 లక్షలు, ఎమ్‌పవర్డ్‌+ వేరియంట్ ధర రూ.13.29 లక్షలు.

అడ్వెంచర్ వేరియంట్ రూ.12.99 లక్షలు, ఎమ్‌పవర్డ్‌ వేరియంట్ రూ.13.99 లక్షలు, ఎమ్‌పవర్డ్‌+ వేరియంట్‌ 14.49 లక్షల ధరల్లో లభిస్తాయి. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ అని గమనించాలి. పంచ్ EV హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, MG ZS EV, మహీంద్రా eXUV300 వంటి ఇతర ఎలక్ట్రిక్ SUVలతో పోటీ పడుతుంది.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.