PAN Card: Have two PAN cards? Immediately, do this.. or there will be problems!
PAN Card: రెండు పాన్ కార్డులు ఉన్నాయా? వెంటనే, ఈ పని చేయండి.. లేదంటే సమస్యలు తప్పవు!
PAN Card: భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. దీనికి భారీ జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వద్ద రెండు పాన్ కార్డులు ఉంటే, వెంటనే డూప్లికేట్‌ను సరెండర్ చేయాలి.
భారతదేశంలో ఏ విధమైన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌లు చేయాలన్నా పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) అవసరం. PAN కార్డును ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేస్తుంది. పాన్ నంబర్ అనేది పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. వ్యక్తులు, సంస్థలకు, ప్రధానంగా పన్ను సంబంధిత ప్రయోజనాల కోసం ఐడెంటిఫికేషన్ నంబర్‌లా పనిచేస్తుంది. ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడంలో, పన్ను ఎగవేతను నిరోధించడంలో పాన్ కార్డు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
అయితే భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. దీనికి భారీ జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వద్ద రెండు పాన్ కార్డులు ఉంటే, వెంటనే డూప్లికేట్‌ను సరెండర్ చేయాలి. ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో చట్టబద్ధంగా పాన్ కార్డును ఎలా సరెండర్ చేయాలో తెలుసుకుందాం.
ఒక వ్యక్తి లేదా సంస్థ ఒక పాన్ కార్డు కలిగి ఉండటానికి మాత్రమే అనుమతి ఉంది. మల్టిపుల్ పాన్ కార్డులు దుర్వినియోగానికి దారితీస్తాయి. ఫైనాన్షియల్ రికార్డులను క్లిష్టతరం చేస్తాయి. దీంతో చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకు రూ.10,000 వరకు జరిమానా విధిస్తారు. అందుకే మీ వద్ద ఉన్న ఏవైనా అదనపు పాన్ కార్డులను సరెండర్ చేయడం చాలా ముఖ్యం.
ముందుగా NSDL వెబ్‌సైట్‌కి వెళ్లి, ‘PAN చేంజ్ రిక్వెస్ట్ ఆన్‌లైన్ ఫారమ్’ పేజీని యాక్సెస్ చేయండి. తర్వాత ‘అప్లికేషన్ టైప్’లో ‘చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా/రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్’ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. సిటిజెన్‌షిప్, కేటగిరీ, టైటిల్, వంటి అవసరమైన వివరాలతో ఫారమ్‌ను పూరించండి. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
ఇమెయిల్‌కి వచ్చిన టోకెన్ నంబర్‌ను నోట్ చేసుకోండి. ‘కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫారమ్’పై క్లిక్ చేయండి. సబ్మిషన్ మెథడ్ ఎంచుకోండి. ఆధార్ బేస్డ్ ఇ-కెవైసి/ఇ-సైన్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ లేదా ఫిజికల్ సబ్మిషన్‌లో సెలక్ట్ చేసుకోండి. అన్ని ఫీల్డ్‌లను పూర్తి చేయండి, సరెండర్ చేయడానికి PANలను సూచించండి, చెక్‌బాక్స్‌లను సెలక్ట్ చేయండి. నెక్స్ట్‌పై క్లిక్ చేయండి.
సబ్మిషన్ కోసం ఐడెంటిటీ, రెసిడెన్స్, పుట్టిన తేదీ రుజువును ఎంచుకోండి. ఫోటో, సంతకం, అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి. ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఉండాలి. అప్లికేషన్ ప్రివ్యూను రివ్యూ చేసి, అవసరమైతే ఎడిట్ చేయండి లేకపోతే పేమెంట్‌కి ప్రొసీడ్ అవ్వండి.
డిమాండ్ డ్రాఫ్ట్, క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు పేమెంట్ చేయండి. పేమెంట్ తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసి, ఫోటోలను అటాచ్ చేయాలి. అక్నాలెడ్జ్‌మెంట్‌పై సంతకం చేసి, ఎన్వలప్‌ను NSDL e-Govకి మెయిల్ చేయండి.
ముందుగా ఫారమ్ 49A పూరించాలి. ఈ ఫారమ్ పాన్ డేటాలో మార్పులు లేదా దిద్దుబాట్లు చేయడానికి ఉపయోగపడుతుంది. PANని స్పష్టంగా పేర్కొంటూ ఈ ఫారమ్ పూరించాలి. సరెండర్ చేయాలనుకుంటున్న నంబర్, ఈ ఫారమ్‌ను సమీప UTI లేదా NSDL TIN ఫెసిలిటేషన్ సెంటర్‌లో సమర్పించండి. మీ రికార్డుల కోసం అక్నాలెడ్జ్‌మెంట్ కాపీని ఉంచుకోండి.
తర్వాత మీ అధికార పరిధిలోని అసెస్సింగ్ అధికారికి ఒక లెటర్ రాయండి (www.incometaxindiaefiling.gov.inలో అధికారి వివరాలు తెలుసుకోవచ్చు). పూర్తి పేరు, పుట్టిన తేదీ, సరెండర్ చేయాలనుకుంటున్న పాన్ నంబర్, సరెండర్ చేస్తున్న పాన్ కార్డ్ వివరాలు చేర్చండి. అక్నాలెడ్జ్‌మెంట్ కాపీని ఉంచుకోండి. లెటర్‌తో పాటు డూప్లికేట్ పాన్ కార్డ్ కాపీని, NSDL TIN ఫెసిలిటేషన్ సెంటర్ నుంచి అందుకున్న అక్నాలెడ్జ్‌మెంట్ కాపీని అందజేయండి.
ఈ డాక్యుమెంట్‌లు అన్నింటినీ NSDL ఇ-గవర్నమెంట్ ఇన్‌కమ్ టాక్స్ పాన్ సర్వీసెస్ యూనిట్, NSDL ఇ-గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, 5వ అంతస్తు, మంత్రి స్టెర్లింగ్, ప్లాట్ నెం. 341, సర్వే నెం. 997/8, మోడల్ కాలనీ, డీప్ బంగ్లా చౌక్ దగ్గర, పూణే 01411, అడ్రెస్‌కి 15 రోజులలోపు పంపండి.