WhatsApp: New feature in WhatsApp channels.. Option to conduct polls launched

WhatsApp: New feature in WhatsApp channels.. Option to conduct polls launched

WhatsApp: వాట్సాప్ ఛానల్స్‌లో కొత్త ఫీచర్.. పోల్స్ నిర్వహించే ఆప్షన్ లాంచ్

WhatsApp: New feature in WhatsApp channels.. Option to conduct polls launched


ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) గతేడాది ఎన్నో ముఖ్యమైన ఫీచర్లను పరిచయం చేసింది. వాటిలో ఛానల్స్‌ (Channels) ఒకటి. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు ఛానల్స్‌ క్రియేట్ చేయవచ్చు. ఆ ఛానల్స్‌ను ఇతరులు ఫాలో అవుతూ క్రియేటర్ల నుంచి ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్, లింక్స్‌ను సింపుల్‌గా రిసీవ్ చేసుకోవచ్చు. ఈ కంటెంట్‌కు ఫాలోవర్లు ఎమోజీలతో రియాక్ట్ కూడా కావచ్చు. అయితే ఈ స్పెసిఫికేషన్‌ను ఇంప్రూవ్ చేసేందుకు వాట్సాప్ డెవలపర్లు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఛానల్స్‌లో పోల్స్‌ (Polls) ఫీచర్ అందించే పనిలో పడ్డారు. క్రియేటర్లు ఈ పోల్స్‌ ద్వారా ఫాలోవర్ల ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవచ్చు.

వాట్సాప్‌ బీటా ఇన్ఫో (WABetaInfo) రిపోర్ట్ ప్రకారం, వాట్సాప్ ఇప్పుడు iOS బీటా యూజర్ల కోసం ఛానల్స్‌లో పోల్స్‌ను పరీక్షిస్తోంది. లేటెస్ట్ అప్‌డేటెడ్ వెర్షన్ 24.1.10.76లో పోల్స్ ఫీచర్ కనిపించినట్లు వాట్సాప్‌ బీటా ఇన్ఫో రిపోర్టు వెల్లడించింది. ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు గత వారం ఈ ఫీచర్‌ రిలీజ్ అయింది.

WhatsApp: వాట్సాప్‌ ఐఓఎస్ వెర్షన్లకు స్టిక్కర్స్ ఫీచర్ లాంచ్..క్రియేట్,ఎడిట్ చేసే ప్రాసెస్

వాట్సాప్ ఛానల్స్‌లో పోల్స్‌ స్పెసిఫికేషన్‌తో ఓనర్లు, అడ్మిన్లు ఫాలోవర్లను ప్రశ్నలు అడగవచ్చు. ప్రశ్న కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చి సింపుల్, క్రిస్టల్ క్లియర్ వేలో రెస్పాన్స్‌లు పొందవచ్చు. పోల్‌కు ప్రత్యేకంగా ఎవరు కాంట్రిబ్యూట్ చేశారో తెలియకుండానే పార్టిసిపెంట్లు మొత్తం ఓట్ల సంఖ్యను చూడగలరు

ఛానల్‌లో పోల్‌ను క్రియేట్ చేయడానికి, చాట్ అటాచ్‌మెంట్ మెనూ ఓపెన్ చేసి, పోల్ ఆప్షన్ ఎంచుకోవాలి. మల్టిపుల్ ఆన్సర్స్‌ను అనుమతించాలా లేదంటే సింగిల్ ఆన్సర్ మాత్రమే ఇచ్చేలా ఓటర్లను అనుమతించాలా అనేది సెలక్ట్ చేసుకోవచ్చు. పోల్స్‌ అనానిమస్ (Anonymous)గా ఉంటాయి. అంటే ఎవరు దేనికి ఓటు వేశారో ఛానల్ క్రియేటర్లు చూడలేరు. దీనివల్ల ఓటర్ల ప్రైవసీ, సెక్యూరిటీకి ఎలాంటి భంగం వాటిల్లదు. ఫాలోవర్లు అభిప్రాయాలను, ప్రాధాన్యతలను స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చు.

ఈ ఫీచర్ ప్రస్తుతానికి iOS, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లలోని బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సాప్ మరికొద్ది వారాల్లో దీన్ని త్వరలో స్టేబుల్ అప్‌డేట్‌లో వినియోగదారులందరికీ విడుదల చేసే అవకాశం ఉంది.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.