SBI: Admit cards released for 5447 jobs in SBI.. Download like this..
SBI: ఎస్‌బీఐలో 5447 ఉద్యోగాలకు అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
SBI: ఎస్‌బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (CBO) రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది.
ఎస్‌బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (CBO) రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. 5447 పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే ముగియగా, తాజాగా అడ్మిట్ కార్డులను సైతం ఎస్బీఐ జారీ చేసింది. రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈ నెల 21న ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డులను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ ప్యాట్రన్ ఎలా ఉంటుంది, ఎంపికైన వారికి జీతభత్యాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
- ముందు ఎస్‌బీఐ అధికారిక పోర్టల్ www.sbi.co.in ను ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలోకి వెళ్లి, ‘జాయిన్ ఎస్‌బీఐ’ ఆప్షన్ ట్యాప్ చేయాలి. ఆ తరువాత ‘కరెంట్ ఓపెనింగ్స్’ లింక్ క్లిక్ చేయాలి.
- దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ‘ఎస్‌బీఐ సీబీఓ రిక్రూట్‌మెంట్ అడ్మిట్‌కార్డ్-2024’ అనే లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి.
ఎస్‌బీఐ సీబీవో రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఎంపిక ప్రక్రియ వివిధ దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్షను జనవరి 21న నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తారు. ఆ తరువాత ఫైనల్‌గా అభ్యర్థుల ఎంపిక చేస్తారు.
ఎస్‌బీఐ సీబీఓ పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టైప్‌లో జరుగుతుంది. ఆబ్జెక్టివ్ ప్యాట్రన్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ వంటి నాలుగు సెక్షన్స్ ఉంటాయి. మొత్తంగా 120 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. డిస్క్రిప్టివ్ ప్యాట్రన్ ఎగ్జామ్‌లో లెటర్ రైటింగ్, బ్యాంకింగ్ సంబంధించి 250 వర్డ్స్ ఎస్సే రైటింగ్ ఉంటుంది. ఒక్కోదానికి 25 మార్కుల చొప్పున కేటాయిస్తారు.
ఎంపికయ్యే అభ్యర్థులకు ప్రారంభంలో జీతం నెలకు రూ.58,000 ఉంటుంది. ఇందులో డియర్‌నెస్ అలవెన్స్ - రూ16,884, హౌస్ రెంట్ అలవెన్స్ - రూ.2,520, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ - రూ.1,080, ఇతర అలవెన్సులు - రూ.2,000 కలిసి ఉంటాయి. డిడక్షన్-రూ.8100 కాగా, చేతికి వచ్చే జీతం రూ.50,000.
ఎస్‌బీఐ సీబీఓ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులు సీనియర్ అధికారులు కేటాయించిన అన్ని టాస్క్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. మెయిన్ బ్రాంచ్ ఫంక్షన్స్ మేనేజ్, కస్టమర్స్‌తో కార్డినల్ రిలేషన్స్ మెయిన్‌టెన్స్, బ్యాంక్ తీసుకునే అన్ని పాలసీలు సక్రమంగా అమలయ్యేలా చూడటం, లోన్స్ మంజూరు చేయడం, బ్యాంక్‌లో జరిగే వ్యవహారాలను మానిటర్ చేయడం వంటి బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.
కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఓ నోటిఫికేషన్‌ను 2023 నంబర్ 21న విడుదల చేసింది. నవంబర్ 22 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభించింది. డిసెంబర్ 17న ఈ గడువు ముగిసింది. జనవరి 16న అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి.