Job Fair: Good news for degree and PG graduates... Job offers!
Job Fair: డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారికి శుభవార్త.. జాబ్ ఆఫర్లు!
డిగ్రీ, పీజీలు పూర్తి చేసి సకాలంలో జాబ్ లభించక, ఉన్న గ్రామాల్లో ఉపాధి లేక నిరుత్సాహ పడుతున్నారు ఎంతో మంది యువత. చదివిన చదువుకు ఉద్యోగం దొరక్క, జీవనోపాధిని అధికమించలేక ఎందుకు ఈ చదువులని నిరాశ పడుతున్నారు. అలాంటి వారికి ఇది మంచి శుభవార్తే అని చెప్పాలి. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఒక ప్రైవేటు సంస్థ యజమాని మంచి ఆలోచనతో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించునున్నట్టు నిరుద్యోగులకు ఒక తీపి కబురు చెప్పారు. కుప్పం నియోజకవర్గ వాసులకు ఇది ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.
ఇందులో జాబ్ మేళా నిర్వహించనున్నారు. శనివారం మెగా జాబ్ మేళా గుడిపల్లి రోడ్డు లోని ఐఆర్ఎం విద్యాసంస్థలు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్ దయానిధి తెలిపారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలకు చెందిన ప్రముఖ MNCకంపెనీల ప్రతినిధులు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారన్నారు. కళాశాల విద్యార్థులతో పాటు కుప్పం పరిసర ప్రాంతాల్లో డిగ్రీ , పీజీలు చేసిన విద్యార్థులు శనివారం 9 గంటలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆయన కోరారు.