BharatGPT: Start of another miracle.. Jio Bharat GPT is ready.. to compete with ChatGPT..

 BharatGPT: Start of another miracle.. Jio Bharat GPT is ready.. to compete with ChatGPT..

BharatGPT: మరో అద్భుతానికి శ్రీకారం.. జియో భారత్‌ జీపీటీ రెడీ.. చాట్‌జీపీటీకి పోటీగా..

BharatGPT: Start of another miracle.. Jio Bharat GPT is ready.. to compete with ChatGPT..

What is Bharat GPT : ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. బడా టెక్‌ కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. ఈ క్రమంలో.. గూగుల్, మైక్రోసాఫ్ట్‌ తరహాలో దేశీయ టెలికం సంస్థ జియో కూడా అడుగుపెడుతోంది.

Reliance Jio IIT Bombay Working on Bharat GPT : ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), చాట్‌జీపీటీ (ChatGPT) ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఓ సంచలనం.. ఓపెన్ ఏఐతోపాటు గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమకంటూ సొంత చాట్ బోట్‌లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. ప్రపంచంలోని అతిపెద్ద భారతీయ కంపెనీలలో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ ఏఐ ఆధారిత వ్యవస్థలోకి అడుగుపెట్టింది. అందుకోసం ఐఐటీ-బాంబే (IIT-Bombay)తో కలిసి ‘భారత్ జీపీటీ’ (BharatGPT) డెవలప్‌మెంట్‌పై పని చేస్తున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. ముంబైలో జరిగిన ‘టెక్ ఫెస్ట్’లో ఈ విషయాన్ని వెల్లడించ.

చాట్ జీపీటీ (ChatGPT) తరహాలో భారత్ జీపీటీ (BharatGPT) కూడా కృత్రిమ మేధ (artificial intelligence - AI) ఆధారిత సమాచార వ్యవస్థ. దీన్ని రిలయన్స్ జియో (Reliance Jio), ఐఐటీ బాంబే (IIT-Bombay) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఒక విస్తృత సమాచార వ్యవస్థను రూపొందించడం భారత్ జీపీటీ లక్ష్యం. ఈ భారత్ జీపీటీని "జియో 2.0" అని కూడా పిలుస్తున్నారు. రిలయన్స్ జియో విస్తృత విజన్ లో భాగంగా దీన్ని రూపకల్పన చేశారు. ఉత్పత్తులు, సేవల ప్రతి అంశంలో కృత్రిమ మేధ ప్రవేశించబోతోందని ఆకాశ్ అంబానీ వ్యాఖ్యానించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రతి రంగంలో ఉత్పత్తులు, సేవల్లో పెను మార్పులు తేవొచ్చు. తమ సంస్థలోని అన్ని విభాగాల్లో ఏఐ సేవలను ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం అని ఆకాశ్ అంబానీ తెలిపారు. దీంతోపాటు టెలివిజన్ల కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తేవడానికి విస్తృత స్థాయిలో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కంపెనీ డెవలప్ మెంట్ కోసం ఒక వ్యవస్థ రూపకల్పన చాలా ముఖ్యమని.. జియో 2.0పై ఇప్పటికే పనులు ప్రారంభించామని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. వచ్చే దశాబ్దిని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జెనరేటివ్ ఏఐ నిర్వచిస్తాయని తెలిపారు. మీడియా స్పేస్, కామర్స్, కమ్యూనికేషన్ల రంగంలోనూ ఉత్పత్తులు, సర్వీసులను ఆవిష్కరిస్తామన్నారు.

రిలయన్‌తో ఐఐటీ బాంబే 2014 నుంచి వివిధ కార్యక్రమాల రూపకల్పనల్లో భాగస్వామిగా ఉంది. కృత్రిమ మేధ విస్తృత సామర్థ్యం సహకారంతో సృజనాత్మకత, వైవిధ్య పూరిత ఉత్పత్తులు, సేవలను అందించడం లక్ష్యంగా ఈ రెండు కలిసి పని చేస్తున్నాయి. ఐఐటీ బాంబేలోని కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగం రిలయన్స్ జియో సహకారంతో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, GPT సొల్యూషన్స్‌పై అన్ని రంగాల కోసం భారతదేశ స్వంత భారత్ జీపీటీ (BharatGPT) ని అభివృద్ధి చేయడానికి పరిశోధనలు చేస్తోంది.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.