Google Maps : New feature in Google Maps.. Now sharing location is very simple!
Google Maps : గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్.. ఇకపై లొకేషన్ షేర్ చేయడం చాలా సింపుల్!
Google Maps Location Sharing : మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా గూగుల్ మ్యాప్స్‌లో సైతం కొత్త మార్పులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Google Maps Real Time Location Sharing : గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మనం సుదూర ప్రాంతాలకు, కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి రూట్లు, షార్ట్ కట్ మార్గాలను తెలుసుకోవడానికి సెర్చింజన్ గూగుల్ తన గూగుల్ మ్యాప్స్ (Google Maps) అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రూట్ మ్యాప్‌పై రియల్ టైం లొకేషన్ షేరింగ్ వసతులు కూడా అందిస్తోంది. అయితే.. గూగుల్ అందించే రియల్ టైం లొకేషన్ చేయాలంటే తప్పనిసరిగా వాట్సాప్, టెలిగ్రాం వంటి మరో యాప్‌ల మీద ఆధార పడాలి.
ఇక మీదట అలాంటి ఇబ్బందులు లేకుండా.. కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది గూగుల్ మ్యాప్స్. ఈ ఫీచర్ సాయంతో ఏ ఇతర యాప్స్ లేకుండా కేవలం సాధారణ మెసేజ్ తో రియల్ టైం లొకేషన్ షేర్ చేయొచ్చు. రియల్ టైం లొకేషన్ వివరాలతోపాటు, స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ స్టేటస్ కూడా ఇందులో కనపడుతుంది.
ఈ కొత్త ఫీచర్‌లో లొకేషన్ లిమిట్ ఆప్షన్ ఉండొచ్చు. వద్దనుకున్నప్పడు షేరింగ్ ఆప్షన్ నిలిపేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల్లో చాలా మంది వాట్సాప్ యాప్ వాడరు. అటువంటి వారికి ఈ ఫీచర్ ఉపకరిస్తుంది. మీరు లొకేషన్ షేర్ చేయాలన్నా సంబంధిత వ్యక్తి ఫోన్‌లో గూగూల్ మ్యాప్స్ లో లాగిన్ అయి ఉండాలి.
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే ‘అడ్రస్ డిస్క్రిప్టర్స్’ను గత నెలలో గూగుల్ మ్యాప్స్‌లో ప్రవేశపెట్టారు. నగరం లోపల, శివారు ప్రాంతాల్లో లొకేషన్‌ను కనుగొనేందుకు ఇదెంతగానో దోహదపడుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీనికి కొత్త అప్‌డేట్‌ను చేర్చుతూ తాజాగా సరికొత్త ఫీచర్ ‘లొకేషన్ షేరింగ్’ను తీసుకొచ్చింది.