centre issued new guidelines to JEE, NEET coaching centres amid students suicides

 centre issued new guidelines to JEE, NEET coaching centres amid students suicides

NEET, JEE: నీట్, జేఈఈ కోచింగ్ సెంటర్లకు కేంద్రం షాక్-విద్యార్ధుల ఆత్మహత్యల ఎఫెక్ట్..!

centre issued new guidelines to JEE, NEET coaching centres amid students suicides

దేశవ్యాప్తంగా జాతీయ స్దాయి పరీక్షలైన నీట్, జేఈఈ కోచింగ్ పేరుతో జరుగుతున్న అరాచకాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఇవాళ స్పందించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నీట్, జేఈఈ కోచింగ్ ఇస్తున్న కోచింగ్ సెంటర్లకు షాకిచ్చేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్ధులను ఆయా పరీక్షల కోచింగ్ కు చేర్చుకునే అంశంతో పాటు ఇతర విషయాల్లోనూ కోచింగ్ సెంటర్లు పాటించాల్సిన మార్గదర్శకాలను వెల్లడించింది.

కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకపై జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్లు 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న విద్యార్ధులను చేర్చుకోకూడదు. అలాగే విద్యార్ధులకు కచ్చితంగా ర్యాంకులు తెప్పిస్తామనే హామీ కూడా ఇవ్వకూడదు. మరోవైపు డిగ్రీ కంటే తక్కువ అర్హత ఉన్న ట్యూటర్లు కోచింగ్ సెంటర్లలో బోధించడానికి వీల్లేదు. అలాగే కేంద్రం మార్గదర్శకాలను ఉల్లంఘించి విద్యార్ధుల నుంచి కోచింగ్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్లకు భారీ జరిమానాలు విధించాలని కూడా నిర్ణయించింది. అక్రమాలు జరిగినట్లు తేలితే రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని హెచ్చరించింది.

మరోవైపు జేఈఈ, నీట్ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న కోచింగ్ సెంటర్లపై పర్యవేక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన మూడు నెలల్లో ప్రతీ సెంటర్ ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఏ కోచింగ్ సెంటర్ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కోచింగ్ నాణ్యత లేదా అందులో అందించే సౌకర్యాలు, ఫలితాలపై విద్యార్ధులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయకూడదు.

అలాగే కోచింగ్ సెంటర్లకు వచ్చే విద్యార్ధుల మానసిక ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి వారికి వారానికోసారి సెలవు ఇవ్వడం, తగిన రోజుకు ఐదు గంటల కంటే ఎక్కువగా క్లాసులు లేకుండా తగిన బ్రేక్ లు ఇవ్వాలని కేంద్రం సూచించింది. ప్రతీ కోచింగ్ సెంటర్‌ తమ వద్ద ఉన్న ట్యూటర్‌ల అర్హతలు, కోర్సులు, వాటిని పూర్తి చేసిన వ్యవధి, హాస్టల్ సౌకర్యాలు, వసూలు చేస్తున్న ఫీజుల వివరాలతో వెబ్ సైట్ నిర్వహించాల్సి ఉంటుంది.

అలాగే విద్యార్దులకు సులభమైన ఎగ్జిట్ పాలసీ, ఫీజు రీఫండ్ పాలసీ వివరాలను కూడా వెబ్‌సైట్‌లో ఉంచాలి. ఒక విద్యార్థి కోర్సు నుండి నిష్క్రమించాలనుకుంటే 10 రోజులలోపు ప్రో-రేటా ప్రాతిపదికన కోచింగ్ సెంటర్లు ఫీజు తిరిగి చెల్లించాలి. విద్యార్ధుల్ని కుటుంబంతో కనెక్ట్ గా ఉంచేందుకు, భావోద్వేగాల నిర్వహణకు కోచింగ్ సెంటర్లలో తగిన మార్పులు చేయాలి. అలాగే కోచింగ్ సెంటర్లలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, లైఫ్ స్కిల్స్, సైకాలజిస్ట్ కౌన్సెలింగ్, ఎమోషనల్ బాండింగ్, మానసిక ఉల్లాసానికి కచ్చితంగా అందుబాటులో ఉంచాలి.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.