AI Threat: Jobs will be lost with artificial intelligence.. Be careful!
AI Threat: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలు గల్లంతు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
AI Threat: ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) చీఫ్ క్రిస్టాలినా జార్జివా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై AI ప్రభావం గురించి అభిప్రాయాలను పంచుకున్నారు. AI అనేది ఉద్యోగులకు ఒక రిస్క్‌గా ఉండటమే కాక జాబ్ సెక్యూరిటీని పెంచుతుందని క్రిస్టాలినా AFP వార్తా సంస్థతో చెప్పారు...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది ఒక పవర్‌ఫుల్ టెక్నాలజీ. దీనికి వివిధ పరిశ్రమలు, రంగాలను సమూలంగా మార్చే శక్తి ఉంది. అంతేకాదు, AI అనేక మానవ ఉద్యోగాలను భర్తీ చేయవచ్చు. దీనివల్ల చాలామంది ప్రజలు నిరుద్యోగులుగా మారి రోడ్డున పడే అవకాశం ఉంది. AIని జాబ్ మార్కెట్‌కు ఒక అతిపెద్ద ముప్పుగా పరిగణించవచ్చు. అలాగే ఇది ఆదాయాలను పెంచుకునే అవకాశాలను కూడా అందించవచ్చు.
2022లో ఓపెన్ఏఐ (OpenAI) సంస్థ జనరేటివ్ AI మోడల్ చాట్‌జీపీటీ (ChatGPT)ని ప్రారంభించినప్పటి నుంచి ఎక్స్‌పర్ట్స్, డెవలపర్లు జాబ్స్‌పై AI ఎఫెక్ట్ గురించి చర్చిస్తున్నారు. ఇటీవల ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) చీఫ్ క్రిస్టాలినా జార్జివా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై AI ప్రభావం గురించి అభిప్రాయాలను పంచుకున్నారు.
AI అనేది ఉద్యోగులకు ఒక రిస్క్‌గా ఉండటమే కాక జాబ్ సెక్యూరిటీని పెంచుతుందని క్రిస్టాలినా AFP వార్తా సంస్థతో చెప్పారు. AI ఉద్యోగుల ప్రొడక్టివిటీ, గ్రోత్ పెంచుతుందని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. అలానే AI అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో 60% ఉద్యోగాలను, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 40% ఉద్యోగాలను ప్రభావితం చేయగలదని పేర్కొన్నారు.
IMF ప్రకారం, AI లేబర్ మార్కెట్‌పై మిశ్రమ ప్రభావాన్ని చూపుతుంది. దాదాపు సగం ఉద్యోగాలు AI వల్ల ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటే, మిగిలిన సగం దాని నుంచి ప్రయోజనం పొందుతాయి. అయితే ప్రయోజనాలు ప్రాంతాల వారీగా సమానంగా లభించవు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు AI నుంచి తక్కువ ప్రయోజనం ఉంటుంది.
AI కారణంగా కొన్ని ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయని, ఇది మంచిది కాదని జార్జివా హెచ్చరించారు. మరోవైపు కొన్ని ఉద్యోగాలు AI ద్వారా ఇంప్రూవ్ అవ్వవచ్చు, తద్వారా ఉద్యోగులు ప్రొడక్టివిటీని పెంచుకుని ఆదాయాన్ని కూడా పెంచుకోగలుగుతారు. AI అందించే అవకాశాలను లో-ఇన్‌కమ్ కంట్రీస్‌కు అందించడంలో సహాయం చేయడం చాలా కీలకమని ఆమె అన్నారు. AI ముప్పుగా మారవచ్చని ఆమె అంగీకరించారు, అలానే అది అద్భుతమైన అవకాశాలను అందిస్తుందని నొక్కి చెప్పారు.
ఉద్యోగులు అడ్వాన్స్‌డ్‌గా మారుతున్న ఏఐ సామర్థ్యాలతో పోటీగా స్కిల్స్, నాలెడ్జ్‌ను పెంచుకోవాలి. ఐబీఎం టెక్నాలజీ కంపెనీ గతేడాది ఆగస్టులో ప్రచురించిన నివేదికలో ఇదే విషయాన్ని సూచించింది. AI, ఆటోమేషన్ కారణంగా వచ్చే మూడేళ్లలో 40% మంది గ్లోబల్ వర్కర్లు మళ్లీ స్కిల్స్ సాధించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. అయితే, AI ఉద్యోగాలను భర్తీ చేయదని, కానీ వాటిని పెంచుతుందని కూడా పేర్కొంది.
కస్టమర్ సర్వీస్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ వంటి AI ద్వారా ప్రభావితమయ్యే కొన్ని రంగాలను నివేదిక గుర్తించింది. ఈ రంగాలలోని కార్మికులు కొత్త స్కిల్స్‌ను నేర్చుకోవాలని, పనికి అవసరమైన వాటిపై దృష్టి పెట్టాలని పేర్కొంది. కంపెనీలు, ఎగ్జిక్యూటివ్‌లు మారుతున్న వర్క్ ఎన్విరాన్‌మెంట్‌కు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంది.
ఉద్యోగాలపై AI ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని మార్గాలను కూడా నివేదిక సూచించింది. వాటిలో ఒకటి మెషీన్-హ్యూమన్ పార్ట్‌నర్‌షిప్‌ను ప్రోత్సహించడం, అంటే వర్కర్స్ మెరుగైన, ఫాస్ట్ పర్ఫామెన్స్ కోసం AIని ఉపయోగించుకోవచ్చు. వర్కర్స్ హై-వాల్యూ ట్యాస్క్స్‌పై దృష్టి పెట్టడానికి, ఇన్‌కమ్ పెంచుకోవడానికి వీలు కల్పించే టెక్నాలజీని ఉపయోగించవచ్చు. అలానే AI ప్రాంప్ట్ ఇంజనీర్ వంటి AI కారణంగా ఉద్భవిస్తున్న కొత్త జాబ్స్ అన్వేషించవచ్చు. AI యుగంలో హై-డిమాండ్ ఉన్న డేటా సైన్స్, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్స్‌లోని స్కిల్స్ నుంచి కూడా కార్మికులు ప్రయోజనం పొందవచ్చు.