WhatsApp: Lock Chat.. Another new feature in WhatsApp!
WhatsApp: WhatsApp is reportedly developing a new feature called Lock Chat to prevent private chats from being viewed by others.
It is reported that the popular messaging app WhatsApp is working on another new feature to increase the privacy of WhatsApp users. It seems that it is already being tested experimentally. According to the details on the Wabeta website, WhatsApp is developing a new feature called Lock Chat. This gives users the option to lock their private chats. This means that users will have full control over their personal chats. Thus, along with privacy, security will be enhanced.
WhatsApp: లాక్ చాట్.. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!
WhatsApp: వ్యక్తిగత చాట్లను ఇతరులెవరూ చూడకుండా లాక్ చాట్ అనే కొత్త ఫీచర్‌ను వాట్సప్ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.
WhatsApp యూజర్ల ప్రైవసీని మరింత పెంచేలా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌పై వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాబీటా వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. లాక్ చాట్ (Lock Chat) అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ (WhatsApp) అభివృద్ధి చేస్తోంది. దీనితో యూజర్లు తమ ప్రైవేట్ చాట్లకు లాక్ విధించుకునే ఆప్షన్ ఉంటుంది. అంటే తమ వ్యక్తిగత చాట్లపై యూజర్లకు పూర్తి నియంత్రణ ఉండనుంది. తద్వారా గోప్యతతో పాటు, భద్రత మరింత పెరగనుంది.
ఒకసారి చాట్‌ను లాక్ (Lock Chat) చేస్తే.. కేవలం యూజర్ మాత్రమే ఫింగర్ ప్రింట్ లేదా పాస్‌కోడ్ ద్వారా దాన్ని చూడగలుగుతారని వాబీటా పేర్కొంది. ఫలితంగా ఇతరులెవరూ లాక్ చేసిన చాట్‌ను తెరవడం కుదరదు. ఒకవేళ ఎవరైనా ఫోన్ తీసుకొని లాక్ చేసిన చాట్‌ను పాస్‌కోడ్ లేదా ఫింగర్‌ప్రింట్ లేకుండా చూడాలని ప్రయత్నిస్తే.. ఆ చాట్ మొత్తాన్ని చెరిపేయాలని కోరుతుంది. అలాగే లాక్ చేసిన చాట్‌లో వచ్చిన ఫొటోలు, వీడియోలు నేరుగా డివైజ్ గ్యాలరీలో సేవ్ కావని వాబీటా పేర్కొంది.
ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. దీన్ని అధికారికంగా ఎప్పుడు ప్రవేశపెడతారనేది తెలియాల్సి ఉంది. దీంతో పాటు యూజర్ల టైపింగ్ ఎక్స్‌పీరియెన్స్ పెంచేలా అదనపు ఫార్మాటింగ్ ఆప్షన్లతో కూడిన ‘టెక్ట్స్ ఎడిటర్’ అనే ఫీచర్‌పైన కూడా వాట్సాప్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం.