Mobile phone Lost your mobile phone? Block with a simple request online! No chance even if I change SIM!!
Lost mobile phone? Block with a simple request online! No chance even if I change SIM!!
The Department of Telecom has made a new website available to block stolen phones easily. If you block a stolen phone..
Mobile phone మొబైల్ ఫోన్ పోయిందా? ఆన్లైన్లో సింపుల్ రిక్వెస్ట్‌తో బ్లాక్! సిమ్ మార్చినా నో ఛాన్స్!!
చోరీకి గురైన ఫోన్లను సులభంగా బ్లాక్ చేసేందుకు వీలుగా టెలికాం శాఖ కొత్త వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చింది. చోరీకి గురైన ఫోన్‌ను బ్లాక్ చేస్తే..
అందులో ఇతర సిమ్‌లు వేసినా పనిచేయకుండా చేసే సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది.
మార్కెట్లో నకిలీ మొబైల్ ఫోన్లకు అడ్డుకట్ట వేయడం సహా పోగొట్టుకున్న ఫోన్లను వెంటనే బ్లాక్ చేసేందుకు వీలుగా టెలికాం శాఖ కీలక ముందడుగు వేసింది. దేశంలోని అన్ని మొబైల్ ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు ఉండే డేటాబేస్‌ను అందుబాటులోకి తెచ్చింది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సీఈఐఆర్) పేరుతో సేవలు ప్రారంభించింది. దేశంలోని మొబైల్ ఆపరేటర్ల డేటాబేస్లను ఇది కనెక్ట్ చేస్తుంది. నకిలీ ఫోన్లను గుర్తించడం, మొబైల్ చోరీలను నియంత్రించడం దీని ప్రధాన ఉద్దేశం.
మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లందరినీ ఒకే గొడుగు కిందకు తెస్తుంది సీఈఐఆర్. ఐఎంఈఐ నంబర్‌తో మొబైల్‌ను పనిచేయకుండా బ్లాక్ చేసే అవకాశం ఇది కల్పిస్తుంది. అంతేకాకుండా.. బ్లాక్‌లిస్ట్ చేసిన సిమ్‌లు ఏ ఫోన్లలో ఉన్నాయనే వివరాలను ఇది సేకరిస్తుంది. ఆ ఫోన్లో ఇతర సిమ్‌లు వేసినా పనిచేయనీయకుండా చేస్తుంది. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా యూజర్లు తమ ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను బ్లాక్ చేసుకోవచ్చు. ఫోన్లు చోరీకి గురైతే.. ముందు జాగ్రత్తగా ఇలా బ్లాక్ చేసి మొబైల్ దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు.
పోగొట్టుకున్న/ చోరీకి గురైన ఫోన్‌ను ఎలా బ్లాక్ చేయాలి?
సీఈఐఆర్ వెబ్సైట్ ( http://ceir.gov.in/ )లో ఓ రిక్వెస్ట్ ఫైల్ చేసి తమ ఫోన్ IMEI నెంబర్‌ను బ్లాక్ చేసుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేయకుండా ఏర్పాట్లు కూడా చేశారు. ఎవరుపడితే వారు కాకుండా.. నిజంగా తమ ఫోన్‌ను పోగొట్టుకున్నవారే ఇందులో రిక్వెస్ట్ ఫైల్ చేసే వీలు ఉంటుంది. వెబ్సైట్ ద్వారా IMEI నంబర్‌ను బ్లాక్ చేయాలని అనుకునేవారు.. డివైజ్ వివరాలతో పాటు మొబైల్ కొనుగోలుకు సంబంధించిన బిల్లు, పోలీస్ కంప్లైంట్ లెటర్, ఐడీ ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది.
వీటన్నింటినీ సమర్పించిన తర్వాత 24 గంటల్లో పోగొట్టుకున్న/ చోరీకి గురైన ఫోన్ బ్లాక్ అవుతుంది. ఇక ఆ ఫోన్లో ఏ సిమ్ కార్డ్ వేసినా పనిచేయదు. ఇక ఆ ఫోన్‌ను దాని యజమాని మాత్రమే అన్‌బ్లాక్ చేయగలుగుతారు. మొబైల్ తిరిగి దొరికితే.. అదే పోర్టల్‌లో అన్‌బ్లాక్ రిక్వెస్ట్ పెట్టి.. దాన్ని తిరిగి యూజ్ చేసుకోవచ్చు.
ఈ సేవలను ఇదివరకే పలు ప్రాంతాల్లో ప్రారంభించింది టెలికాం శాఖ. 2019 సెప్టెంబర్ 13న మహారాష్ట్ర, గోవా, దాద్రా నగర్ హవేలీలో సీఈఐఆర్‌ను అందుబాటులోకి తెచ్చారు. అదే ఏడాది డిసెంబర్ 30న దిల్లీలో దీన్ని ఆవిష్కరించారు. తాజాగా ఇది దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. పోగొట్టుకున్న/ చోరీకి గురైన ఫోన్లను బ్లాక్ చేయడం, దొరికిన మొబైళ్లను అన్‌బ్లాక్ చేయడం వంటి సేవలతో పాటు.. రిక్వెస్ట్ స్టేటస్లు, ఐఎంఈఐ వెరిఫికేషన్, నో యువర్ మొబైల్ (నీ మొబైల్ గురించి తెలుసుకో) వంటి సేవలను సైతం ఈ వెబ్సైట్ అందిస్తోంది.