స్మార్ట్ ఫోన్ కి తరచూ ఛార్జింగ్ పెడుతున్నారా. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోగలరు.

  Are you charging your smartphone often? But these things must be known.

Are you charging your smartphone often? But these things must be known.

Nowadays, the use of smart phone is increasing day by day. Every day from waking up in the morning till going to bed at night, they spend time with the phone.

స్మార్ట్ ఫోన్ కి తరచూ ఛార్జింగ్ పెడుతున్నారా. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోగలరు.

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లో వాడకం రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రతిరోజు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఫోన్ తోనే సమయాన్ని కేటాయిస్తున్నారు.

ఇలా చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్లు వినియోగించేవారు వాటి గురించిన కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవల్సి ఉంటుంది. కానీ వాటి గురించి అవగాహన లేకుండానే కొంతమంది వాటిని విచ్చలవిడిగా ఉపయోగించటం వల్ల ఫోన్ తొందరగా పాడవుతూ ఉంటుంది. ముఖ్యంగా అందరూ ఎక్కువగా చేసే పొరపాటు మొబైల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టటం.

ఫోన్ లో ఛార్జింగ్ 100% ఉంటే ఎక్కువ సమయం ఫోన్ ఉపయోగించవచ్చు అన్న ఉద్దేశంతో చాలామంది తరచూ ఫోన్ కి ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. ఇలా తరచూ ఫోన్ చార్జ్ చేయడం వల్ల బ్యాటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఫోన్ బ్యాటరీ పాడవకుండా ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

100 % ఫోన్ ఛార్జింగ్ పెట్టటం వల్ల మొబైల్ లో ఛార్జింగ్ ఎక్కువసేపు ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ చేయటం పెద్ద పొరపాటు. ఎప్పుడైనా సరే మొబైల్ కి 80 నుంచి 90 శాతం వరకు మాత్రమే ఛార్జ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడం స్మార్ట్ఫోన్ ఎక్కువ కాలం పని చేయదు. అందువల్ల పొరపాటున కూడా 100 శాతం ఛార్జ్ చేయవద్దు.

అలాగే మరి కొంత మంది మొబైల్ పూర్తిగా చార్జ్ అయిపోయాక చార్జింగ్ పెడుతుంటారు. ఇలా చేయటం కూడా పెద్ద పొరపాటు. ఫోన్ లో పూర్తీగా ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ పెట్టటం వల్ల కూడా మొబైల్ బ్యాటరీ కొన్ని రోజులకే వీక్ అవుతుంది. అందువల్ల ఫోన్ బ్యాటరీ 20 శాతం ఉన్నప్పుడు మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి. ఎప్పుడూ మీ మొబైల్ బ్యాటరీని 20 నుండి 80 శాతం వరకు ఉంచడం మంచిది . ఛార్జింగ్ తక్కువైన, ఎక్కువైనా మొబైల్ కొన్నిరోజులకు పాడవుతుందని గుర్తుంచుకోండి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.