Electric shock: ఎప్పుడైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు షాక్ కొట్టినట్లు అనిపించిందా? ఆ సమయంలో మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు!

 Electric shock: Ever felt a shock when shaking hands? You will be really shocked to know what happens in your body during that time!

In some cases we feel like a sudden electric shock.

Electric shock: ఎప్పుడైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు షాక్ కొట్టినట్లు అనిపించిందా? ఆ సమయంలో మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు!Electric shock

కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా కరెంట్ షాక్ కొట్టినట్లు ఫీల్ అవుతాం.

ఏదైనా వస్తువును తాకినా.. లేదా ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా ఈ తరహా అనుభూతిని అనుభవిస్తాం. నిజంగా మీకు షాక్ కొట్టకపోయినా.. ఆ చిన్న జర్క్ అలా అనిపిస్తుంది. ఇది మీకు కూడా అనుభవమే అయ్యి ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సమయంలో మన శరీరంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? ఇప్పుడు తెలుసుకుందాం రండి.. అసలు దీని వెనుక ఉన్న సైన్స్ గురించి పరీక్షించి తెలుసుకుందాం..

అసలు షాక్ ఎందుకు వస్తుంది..

ఈ ప్రపంచంలోని పదార్థాలన్నీ పరమాణువులతో తయారయ్యి ఉంటాయి. ఈ పరమాణువు నెగెటివ్ గా చార్జ్ చేయబడిన ఎలక్ట్రాన్లు, పాజిటివ్ గా చార్జ్ చేయబడిన ప్రోటాన్లు, తటస్థ న్యూట్రాన్లను కూడా కలిగి ఉంటాయి. మన శరీరంలో ఎప్పుడూ ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఉంటాయి. శరీరం అణువులను స్థిరంగా ఉంచుతుంది. ఐతే అవి ఎప్పుడైతే అసమతుల్యమౌతాయో అంటే వాటి సంఖ్యలో సమానత కొరవడుతుందో.. అప్పుడు ఎలక్ట్రాన్లలో చలనం సంభవిస్తుంది. సైన్స్ ప్రకారం.. ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగేకొద్దీ, నెగెటివ్‌ చార్జ్‌ను సృష్టించి, పాజిటివ్‌ ఎలక్ట్రాన్ల మాదిరి కదులుతాయి. మనం ఏదైనా వస్తువు లేదా మనిషిని తాకినప్పుడు దానిలోని పాజిటివ్‌ ఎలక్ట్రాన్లు, మనలో నెగెటివ్‌ ఎలక్ట్రాన్లను సృష్టిస్తుంది. దీని వల్ల మనకు షాక్‌ తగిలినట్లు అనిపిస్తుంది. ఈ విధమైన వైబ్రేషన్‌ కొన్ని సందర్భాల్లో కొన్ని అంగుళాల దూరం వరకు సంభవిస్తుంది.

చలికాలంలో ఎక్కువ..

నిజానికి చలికాలంలో ఈ తరహా సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఎందుకంటే శీతాకాలంలో గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. ఇది కొంచెం సూది గుచ్చుకున్నట్లుగా అనుభూతిని కలిగిస్తుంది. అలాంటి భావనే షాక్‌కు కారణమవుతుంది. వేసవిలో గాలి తేమ అధికంగా ఉండి చార్జ్ అయిన ఎలక్ట్రాన్లను నిర్మూలిస్తుంది. కొన్నిసార్లు స్వెటర్ల వంటి ఉన్ని వస్తువులను తాకినప్పుడు కూడా ఇలా జరుగుతుంది. స్వెటర్లు తీయగానే విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ విధమైన కరెంట్‌ మన వెంట్రుకల్లో కూడా ఉత్పత్తి అవుతుంది.

తాకినప్పుడు కరెంట్ ఎలా పుడుతుంది?

ఈ సృష్టిలోని పదార్థాలన్ని పరమాణువులు, అణువులు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లతో నిర్మితమై ఉంటుంది. ఎలక్ట్రాన్లు నెగెటివ్‌ చార్జ్ కలిగి ఉంటాయి. ప్రోటాన్లు పాజిటివ్‌ చార్జ్ కలిగి ఉంటాయి. న్యూట్రాన్ తటస్థంగా ఉంటుంది. అణువు కేంద్రకంలో ప్రోటాన్లు ఉంటే, ఎలక్ట్రాన్లు మాత్రం న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు సమాన సంఖ్యలో ఉన్నప్పుడు అణువు స్థిరంగా ఉంటుంది. ఈ రెండింటి సంఖ్యలో తేడా ఏర్పడితే, ఎలక్ట్రాన్లు బౌన్స్ అవ్వడం ప్రారంభిస్తాయి. దీంతో అణువులో కదలిక ఏర్పడి.. కరెంట్‌ ఉత్పత్తి అవుతుంది.

షాక్‌ వెనుక సైన్స్‌ రహస్యం ఇదే..

కుర్చీలు, తలుపుల వంటి వస్తువులు కండక్టర్లుగా వ్యవహరించి ఎలక్ట్రాన్లు ప్రవహించడానికి అంత సులభంగా అనుమతించవు. అందువల్లనే పరమాణువులో ఎలక్ట్రాన్లు ప్రవహిస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఆ పదార్థంలో కరెంట్ కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ఒక వస్తువులో ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగే కొద్దీ ఆ వస్తువు యొక్క నెగటివ్ చార్జ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రక్రియ జరుగుతూ ఉండే వస్తువులను మనం తాకినప్పుడు.. మన శరీరంలోని పాజిటివ్‌ ఎలక్ట్రాన్లు, ఆ వస్తువులోని నెగెటివ్‌ ఎలక్ట్రాన్‌ తన వైపునకు లాగడం ప్రారంభిస్తాయి. ఈ ఎలక్ట్రాన్ల వేగవంతమైన కదలిక కారణంగా మనకు కరెంట్ షాక్‌ తగిలిన అనుభూతి కలుగుతుంది.

ఆసక్తికర విషయాలు..

మెరుపు సాధారణంగా మేఘాలు ఒకదానికొకటి గుద్దకున్నప్పుడు ఏర్పడుతాయి. ఇది కూడా స్టాటిక్ ఎలక్ట్రిసిటీనే. కానీ పెద్ద మొత్తంలో ఏర్పడుతుంది.

స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఎక్కువ కరెంట్ ను ఉత్పత్తి చేయదు. కానీ మేఘాలు ఒకదానికొకటి గుద్దుకున్నప్పుడు మాత్రం ఉత్పత్తి చేస్తుంది.

సిల్క్, గ్లాసు వంటి వాటిని తాకినప్పుడు పాజిటివ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది.

అలాగే ప్లాస్టిక్ లేదా రబ్బర్ రాడ్ ను రుద్దినప్పుడు నెగెటివ్ చార్జ్ డ్ స్టాటిక్ కరెంట్ ఉత్పత్తి అవుతుంది.

ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కాంతి వేగంతో ప్రయాణిస్తుంది. అంటే దాదాపు సెకనుకు 186,282 మైళ్లు ప్రయాణిస్తుంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.