Do you know about LIC Dhan Varsha Policy.. Chance to get many benefits!
LIC Dhan Varsha Policy is one of the policies of domestic insurance giant Life Insurance Corporation of India. This policy is very beneficial for people.
ఎల్ఐసీ ధన్ వర్ష పాలసీ గురించి తెలుసా.. ఎన్నో ప్రయోజనాలు పొందే ఛాన్స్!
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీలలో ఎల్ఐసీ ధన్ వర్ష పాలసీ కూడా ఒకటి. ఈ పాలసీ ప్రజలకు ఎంతగానో ప్రయోజనకరంగ ఉంటుంది.
ధన్ వర్ష పేరుతో ఎల్ఐసీ ఈ పాలసీని లాంఛ్ చేసింది. ఈ పాలసీతో రక్షణతో పాటు పొదుపు కూడా పొందవచ్చు. ఈ పాలసీ టర్మ్ రెండు రకాలుగా ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు ఎక్కువ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
క్లోజ్-ఎండెడ్ స్కీమ్ అయిన ఈ స్కీమ్ వల్ల ఎంతో బెనిఫిట్ కలుగుతుంది. ఈ స్కీమ్ సింగిల్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కాగా ఈ స్కీమ్ నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ సేవింగ్స్ స్కీమ్ కూడా కావడం గమనార్హం. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు పాలసీ టర్మ్ పూర్తి కాకముందే మరణిస్తే నామినీ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రమాదంలో అంగ వైకల్యం సంభవిస్తే పది సంవత్సరాల పాటు నెలసరి వాయిదాలలో చెల్లించాల్సిన మొత్తాన్ని పొందవచ్చు.
మెడికల్ తో పాటు నాన్ మెడికల్ విభాగాల్లో ఈ పాలసీ అందుబాటులో ఉంది. పది, 15 సంవత్సరాల టర్మ్ తో ఈ పాలసీ అందుబాటులో ఉంటుందని సమాచారం అందుతోంది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవళ్లు ఈ పాలసీ బెనిఫిట్స్ ను పొందడానికి అర్హులు. కనీసం 1,25,000 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
పాలసీ టర్మ్ ను బట్టి పొందే ప్రయోజనాల విషయంలో మార్పులు ఉంటాయి. సమీపంలోని ఏజెంట్ ను సంప్రదించడం ద్వారా ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాలసీ ప్రజలకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.