Brain Stroke: Hemorrhage brain stroke.. Stress can come
We get stressed due to various reasons like job, business, personal life, economic problems. Experts say that anxiety and hormonal problems will also increase due to this.
Dopamine and Cortisol hormones are produced in people who are under a lot of stress. Due to this, problems such as drop in blood sugar levels, hypertension, eating disorders, loss of appetite and anemia arise.
Brain Stroke: హెమరైజ్ బ్రెయిన్ స్ట్రోక్.. స్ట్రెస్ ఎక్కువైనా రావచ్చు!
జాబ్, బిజినెస్, పర్సనల్ లైఫ్, ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఇలా రకరకాల కారణాలతో మనం స్ట్రెస్‌కు గురవుతుంటాం. దీనివల్ల యాంగ్జైటీ, హర్మోనల్ ప్రాబ్లమ్స్ ఇన్‌క్రీజ్ కూడా అవుతాయని నిపుణులు చెప్తున్నారు.
అధికంగా స్ట్రెస్‌కు గురయ్యే వారిలో డొపమైన్, కార్టిసోల్ అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ కారణంగా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పడిపోవడం, హైపర్‌టెన్షన్, ఈటింగ్ డిజార్డర్స్, ఆకలి మందగించడం, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి.
హార్ట్ బీట్‌లో మార్పులు
తీవ్రమైన స్ట్రెస్ కారణంగా హార్ట్‌బీట్‌లో మార్పులు వస్తాయి. దీర్ఘకాలంపాటు కొనసాగితే సడన్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
హైబీపీ, గుండె కొట్టుకునే తీరులో వేగం పెరగడం కారణంగా పక్షవాతం ముప్పు పొంచి ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువవడం, తరచూ బీపీ కంట్రోల్‌లో లేకపోవడం కొనసాగుతూ ఉంటే హెమరైజ్డ్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉంది.
ఇమ్యూనిటీ, జీర్ణ క్రియలపై ప్రభావం
ఇమ్యూనిటీ క్షీణించడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్ట్రెస్ కూడా కారణం అవుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ప్రక్రియ వేగవంతమవడం కారణంగా క్రానిక్ డిసీజెస్ తలెత్తే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా పేగులకు పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గి, జీవక్రియల పనితీరు మందగిస్తుంది. ఎంజైమ్‌ల ప్రొడ్యూస్ తగ్గుతుంది. పేగుల్లో పూత, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. స్ట్రెస్ ఎక్కువైతే స్టమక్ పెయిన్, అజీర్ణం, ఆకలి మందగించడం, వికారం, అతిగా తినడం, అల్సర్ వంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి.
స్కిన్ ప్రాబ్లమ్స్, తలనొప్పి
ఒత్తిడివల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దాని కారణంగానే మొటిమలు, దద్దుర్లు రావడం, జట్టు సన్నబడటం లేదా రాలిపోవడం, ఇతర చర్మ సమస్యలు తలెత్తతాయి. తీవ్రమైన ఒత్తిడిలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది.
దీనిని స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది చర్మంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. అంతేగాక అధిక ఒత్తిడి వల్ల తలనొప్పి, పార్శ్వనొప్పి, నిస్సత్తువ, ఆందోళన కలుగుతాయి.
పరిష్కారమేది?
రోజువారీ పనుల్లో నిమగ్నమవడం, యోగా, ధ్యానం, ఇతర శారీరక శ్రమతో కూడిన పనులు ఒత్తిడిని తగ్గిస్తాయి. స్ట్రెస్ హార్మోన్ స్థాయి, బీపీ వంటి సమస్యలను నివారిస్తాయి. నాడీ వ్యవస్థ ఉత్తేజపరుస్తాయి.
సంగీతం వినడం, బొమ్మలు వేయడం, పుస్తకాలు చదవడం లాంటివి కూడా ఆందోళనలను దూరం చేస్తాయి. రోజూ వ్యాయామం, ప్రశాంతంగా ఉండటం, సరిపడా నిద్రపోవడం, అతి ఆలోచనలకు స్వస్తి పలకడం వంటివి స్ట్రెస్‌ను, దాని కారణంగా తలెత్తే సమస్యలను పారదోలే అద్భుతమైన మార్గాలు.