Money: Modi government's bumper.. Rs. 25 thousand into the account for free, just do this!
But good news for you. There is an optional option available. You can get money for free without having to pay anything. How do you think? But you have to know this.
Money: మోదీ సర్కార్ బంపరాఫర్.. ఉచితంగా అకౌంట్‌లోకి రూ.25 వేలు, ఇలా చేస్తే చాలు!
అయితే మీకు శుభవార్త. అదిరిపోయే ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంది. మీరు డబ్బులు కట్టాల్సిన పని లేదుకుండానే ఉచితంగానే డబ్బులు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
మోదీ సర్కార్ అదిరిపోయే ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంచింది. ఉచితంగానే డబ్బులు పొందే వెసులుబాటు కల్పిస్తోంది. ప్రత్యేకమైన కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతగా నిలిస్తే డబ్బులు పొందొచ్చు.
ఇంతకీ అది ఏ కాంటెస్ట్ అని అనుకుంటున్నారా? మీరు ఒక మంచి పోస్టర్ డిజైన్ చేస్తే చాలు. ఏకంగా రూ. 25 వేలు పొందొచ్చు. అదేంటి పోస్టర్ డిజైన్ చేస్తే రూ. 25 వేలు ఎలా ఇస్తారని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ పోటీ గురించి తెలుసుకోవాల్సిందే.
భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఇ మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) తీసుకువచ్చింది. ఇది డిజిటల్ ప్లాట్‌ఫామ్. దీని ద్వారా సెల్లర్లు వారి ప్రొడక్టులను దేశ వ్యాప్తంగా విక్రయించొచ్చు. 2016లో ఈ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వచ్చింది.
గవర్నమెంట్ ఇ మార్కెట్‌ప్లేస్ తాజాగా మైగౌవ్‌తో బాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పోస్టర్ డిజైన్ కాంపిటీషన్ నిర్వహిస్తోంది. ''త్రి పిల్లర్స్ ఆఫ్ జెమ్: ఎఫిసియెంట్, ట్రాన్స్‌పరెంట్, ఇన్‌క్లూజివ్''పై పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్ జరుగుతోంది.
ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే వారు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. పోస్టర్ జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. ఏ3 సైజ్ షీట్‌లో పోస్టర్ డిజైన్ చేయాలి. థీమ్‌కు అనుగుణంగా పోస్టర్ డిజైన్ ఉండాలి. అప్పుడు మీ పోస్టర్‌కు ఎంట్రీ లభిస్తుంది.
ఈ పోటీలో విజేతగా నిలిచిన వారికి మూడు ప్రైజ్‌లు అందజేస్తారు. తొలి స్థానంలో ఉన్న వారికి రూ. 25 వేలు లభిస్తాయి. అదే సెకండ్ ప్లేస్‌లో నిలిచిన వారికి రూ. 20 వేలు వస్తాయి. ఇక మూడో స్థానంలో ఉన్న వారికి రూ. 15 వేలు అందజేస్తారు.
కాగా ఈ పోటీలో పాల్గొనే వారు మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తించుకోవాలి. ఆ పోటీ కొంత కాలమే అందుబాటులో ఉంటుంది. అందువల్ల మీరు వెంటనే ఈ పోటీలో పాల్గొనడం ఉత్తమం. పోస్టర్ డిజైన్ చేసి పంపొచ్చు. 2023 మే 2 వరకు ఈ కాంటెస్ట్ నడుస్తుంది. అప్పటిలోగా మీరు పోస్టర్ డిజైన్ చేసి పంపించాల్సి ఉంటుంది.
పోటీలో విజేతగా నిలిచిన వారికి కేంద్రం నుంచి రూ. 25 వేలు లభిస్తాయి. అంటే పోస్టర్ డిజైన్ చేయడం వల్ల అదిరే బహుమతి సొంతం చేసుకోవచ్చు. జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టకుండానే బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు పొందొచ్చు. మైగౌవ్ సైట్‌లోకి వెళ్లి అప్లికేషన్స్ సమర్పించొచ్చు.