How many days should vegetables be kept in the fridge?2023

 How many days should vegetables be kept in the fridge?2023

ఫ్రిజ్‌లో కూరగాయలు ఎన్ని రోజులుంచాలి?

How many days should vegetables be kept in the fridge?2023

ఫ్రిడ్జ్‌లో కొన్నివారాలపాటు కూరగాయల్ని ఉంచి.. వాటిని బయటకు తీసి వండడం ఇప్పుడు చాలామందికి అలవాటుగా మారింది. కానీ ఇలా వారాల తరబడి ఫ్రిజ్‌లో ఉన్న కూరగాయాలను వండుకుంటే వాటిలోని విటమిన్లు కోల్పోయి పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

- వండిన ఆహారాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్‌టైట్‌ కంటైనర్‌ బాక్స్‌లో పెట్టుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇలా బాక్సుల్లో పెట్టుకున్న ఆహారాన్ని రెండు మూడు రోజుల్లోనే తినేయాలి. ఒకవేళ నిల్వ ఉండే ఆహారాలైనా సరే ఒక వారానికి మించి ఫ్రిజ్‌లో నిల్వ చేయకుండా ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

- రైస్‌ని ఫ్రిజ్‌లో నిల్వ చేయకుండా ఉంటేనే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్రిజ్‌ని పెట్టుకున్నా.. ఒక్కరోజు వ్యవధిలోనే తినేయాలి.

- చికెన్‌, మటన్‌, చేప, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటివి ఫ్రిజ్‌లో వారం రోజుల కంటే ఎక్కువరోజులు నిల్వ ఉంటే వాటి రుచి పోతుంది. పండ్లు, బ్రెడ్‌, కూరగాయలు మూడు లేదా నాలుగురోజులపాటే నిల్వ ఉంచుకోవాలి. అంతకుమించి ఎక్కువరోజులు నిల్వ ఉంచితే అనారోగ్యానికి గురిచేసే బ్యాక్టీరియా చేరుతుంది.

- ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకుండా.. ఏ పదార్థాలనైనా తాజాగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.