Beans.. nutrients equal to meat..!

 Beans.. nutrients equal to meat..!

శనగలు.. మాంసాహారంతో సమాన పోషకాలు..!

మన శరీరానికి పోషకాలు అత్యంత ముఖ్యమైనవి. ఎప్పుడైతే పోషకాలు సక్రమంగా అందుతాయో మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనలో చాలా మంది ఏదైనా అరోగ్య సమస్యకు గురవగానే బలం కోసం బాదం, పిస్తా తింటుంటారు. కేజీ బాదం ఖరీదు దాదాపుగా రూ.800 వరకూ ఉంటుంది. కేవలం గొప్పవారికి మాత్రమే బాదం పప్పు అందుబాటులో ఉండి.. పేదలకు అందుబాటులో ఉండదు. బాదం, పిస్తాలు తింటేనే పోషకాహార లోపం అధిగమిస్తామా అంటే కాదనే చెప్పాలి. బాదం కంటే పోషకాలు కలిగి ఉన్న ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో శనగలు ఒకటి. ఇంకా చెప్పాలంటే మాంసాహారంతో సమానమైన పోషకాలు శనగల్లో ఉన్నాయనేది పోషకాహార నిపుణుల మాట.

              ఫాబేసి కుటుంబానికి చెందిన శనగల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. శనగల్లో నాటు శనగలు, కాబూలీ శనగలు, ఆకుపచ్చరంగులో ఉండే శనగలు కూడా ఉంటాయి. కొన్ని తెల్లగా ఉంటే.. మరికొన్ని డార్క్‌ బ్రౌన్‌ కలర్లో ఉంటాయి. కొన్ని శనగలు నానబెట్టి మొలకలు వచ్చాక పచ్చివి తిన్నా, వేయించుకుని, ఉడికించుకుని తిన్నా ఆరోగ్యకరం. శనగల చాట్‌ అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. శనగల్లో క్యాల్షియం, విటమిన్‌ ఏ, బీ, సీ, ఈ, కే, ఫాలేట్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, సెలీనియం, ఫైబర్‌, ఐరన్‌ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఎముకలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతుంది. క్యాల్షియం లోపంతో బాధపడేవారికి శనగలు మంచి ఆహారం.

శనగలను ఆహారంలో తీసుకోవడం వలన ఐరన్‌, ప్రోటీన్‌, మినరల్స్‌ శరీరానికి ఎనర్జీని అందిస్తాయి. దీంతో అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి దరికి చేరవు. శనగల్లో పీచు సమృద్ధిగా ఉండడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మలబద్ధకం వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ పెరిగేలా చేస్తాయి. దీనివల్ల అధిక బరువును కూడా నియంత్రణలో ఉంచుతాయి. శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేసి ఆస్టియోపోరోసిస్‌, అనీమియాతో బాధపడుతున్నవారికి పౌష్టికాహారంగా ఉపయోగపడతాయి.

మరిన్ని ప్రయోజనాలు..

  • వీటిలో పుష్కలంగా ఉండే పీచు మలబద్ధకాన్ని వదిలించి, జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది.
  • మధుమేహులు రోజూ గుప్పెడు నానబెట్టిన శనగలు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
  • శనగల్లో ఉండే పీచు శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సంబంధ సమస్యలు రాకుండా చూస్తుంది.
  • శనగల్లో ఉండే అమైనోయాసిడ్స్‌ రక్తకణాల వృద్ధికి, రక్త సరఫారకు దోహదపడతాయి.
  • శనగలను తరచూ తింటుంటే రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.
  • నిద్రలేమి సమస్యలు ఉన్నవారు వీటిని నిత్యం తినడం చాలా ఉపయోగకరం.
  • శనగల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది.
  • శనగల్లోని ఆల్ఫా లినోలెనిక్‌ యాసిడ్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ని తగ్గిస్తాయి.
  • శనగల్లో ఉండే విటమిన్‌ బీ9 లేదా ఫోలేట్‌.. మెదడు, కండరాల అభివద్ధికి దోహదపడతాయి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.