Do you know how many health benefits of eating sitting on the floor..?!
నేలపై కూర్చొని తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?!
ప్రస్తుతం..జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. కొన్నేళ్ల క్రితం అందరూ కూర్చొని భోజనాలు చేసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఎవరికివారే హడావిడిగా భోజనం కానివ్వడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అందరూ నేలపై కూర్చొనే భోజనాలు చేసేవారు. అలా నేలపై కూర్చొని తినడం వల్ల వెన్ను సమస్యలతోపాటు, అజీర్తిసమస్యలు కూడా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.
'నేలపై కూర్చొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రత్యేకించి నేలపై కూర్చొని తినడం వల్ల.. వెన్నుముక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వెన్నునొప్పిని తగ్గిస్తుంది. ప్లేట్‌ను నేలపై ఉంచినప్పుడు తినడానికి ముందుకు ఒంగడం వల్ల ఉదర కండరాలు, జీర్ణ ఎంజైమ్‌లు ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీంతో అజీర్తి సమస్యలు తగ్గుతాయి' అని న్యూట్రిషియన్ అమన్ పూరీ అన్నారు.
- నేలపై తినడమే కాదు.. నిటారుగా కూర్చొని వ్యాయామం, చదువుకోవడం వంటి పనులు చేయడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని డాక్టర్ వరలక్ష్మీ తెలిపారు.

