ఈ 5 సింపుల్ స్టెప్స్‌లో ఆధార్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
Download Aadhar card in these 5 simple steps - in seconds..
Aadhaar Download : Aadhaar is a very important identity card for everyone in the country. Aadhaar Card is accepted as ID proof in many places. Whether opening a bank account or buying a new SIM card, Aadhaar is a must for every service. Aadhaar is also required for government schemes. Aadhaar issued by the Unique Identification Authority of India (UIDAI) has such priority. But you can't carry Aadhaar card every time. Then there is no need to worry if you need it urgently. Easy to download online. Downloaded can be printed. If the Aadhaar card is lost, it can be downloaded and kept in this way. And see how to download Aadhaar card online easily.
Aadhaar Download : దేశంలో ఆధార్ అందరికీ ఎంతో ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ఉంది. ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ కార్డు (Aadhaar Card) నే చాలా చోట్ల అంగీకరిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, కొత్త సిమ్ కొనాలన్నా ఇలా ఒక్కటేంటి ప్రతీ సేవకు ఆధార్ తప్పక ఉండాల్సిన పరిస్థితి. ప్రభుత్వ పథకాలకు కూడా ఆధార్ ఉండాల్సిందే. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసే ఆధార్‌కు అంత ప్రాధాన్యత ఉంది. అయితే ప్రతీసారి ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లలేం. అలాంటప్పుడు అత్యవసరంగా కావాల్సిన వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ద్వారా సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆధార్ కార్డు పోయినా ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకొని వద్ద ఉంచుకోవచ్చు.
మరి ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును సులభంగా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూడండి.
1. ముందుగా స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌లో బ్రౌజర్ ఓపెన్ చేసి ఆధార్ అధికారిక వెబ్‌సైట్ (uidai.gov.in) లోకి వెళ్లాలి. అక్కడ గెట్ ఆధార్ సెక్షన్‌లో డౌన్‌లోడ్ ఆధార్ (Download Aadhaar) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
2. అనంతరం లాగిన్ (Login) బటన్‌పై క్లిక్ చేయాలి.
3. ఆ తర్వాత వచ్చే పేజీలో 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. కింద అక్కడే కనిపించే సెక్యూరిటీ క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెండ్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయాలి.
4.ఆ తర్వాత మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ బటన్‌పై క్లిక్ చేయాలి.
5. ఆ తర్వాత ఓపెన్ అయ్యే పేజ్‌లో డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం మీ ఆధార్ వివరాలు వస్తాయి. డౌన్‌లోడ్ అనే బటన్‌పై క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ ఫోల్డర్‌లో పీడీఎఫ్ ఫైల్‌గా మీ ఆధార్ డౌన్‌లోడ్ అయి ఉంటుంది.
ఈ-ఆధార్ కార్డ్ పాస్‌వర్డ్
ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న ఆధార్ పీడీఎఫ్ ఫైల్ పాస్‌వర్డ్‌తో ప్రొటెక్ట్ అయి ఉంటుంది. మీ పేరులోని తొలి నాలుగు అక్షరాలు (క్యాపిటల్ లెటర్స్‌లో), మీ డేట్ ఆఫ్ బర్త్‌లోని సంవత్సరం దానికి పాస్‌వర్డ్‌గా ఉంటుంది.
ఉదాహరణకు.. ఒకవేళ ఆధార్‌లో పేరు Rama Raju అని, డేట్ ఆఫ్ బర్త్ 10 01 1989 అని ఉంటే.. డౌన్‌లోడ్ చేసుకున్న ఆధార్ పీడీఎఫ్ పాస్‌వర్డ్ RAMA1989 అయి ఉంటుంది.