ఇది బిర్యానీ ATM... మూడే నిమిషాల్లో నచ్చిన బిర్యానీ విత్‌డ్రా!
This is Biryani ATM.. Withdraw Biryani of your choice in three minutes!
Biryani: Biryani is crazy different. The number of biryani lovers in the country is increasing day by day. Restaurant owners are creating biryani in new ways to suit the taste and popularity of the customers. There are also innovative trends in serving methods. A restaurant manager in Chennai city went one step further and launched a Biryani ATM together. It is getting good response. How to get Biryani from this ATM? What arrangements have been made for that? Those features..
Biryani: బిర్యానీకి క్రేజే వేరు. దేశంలో బిర్యానీ ప్రియుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కస్టమర్ల అభిరుచికి, ఆదరణకు తగినట్లుగా రెస్టారెంట్ ఓనర్లు సరికొత్త పద్ధతుల్లో బిర్యానీని రూపొందిస్తున్నారు. వడ్డించే పద్ధతుల్లోనూ వినూత్న పోకడలు వచ్చాయి. చెన్నై నగరంలో ఓ రెస్టారెంట్ నిర్వాహకులు మరో అడుగు ముందుకేసి ఏకంగా బిర్యానీ ఏటీఎంను ప్రారంభించారు. దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఏటీఎం నుంచి బిర్యానీ ఎలా తీసుకోవచ్చు? అందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఆ విశేషాలు..
బిర్యానీ ఏటీఎం
ప్రధానాంశాలు:
- బిర్యానీ వడ్డించేందుకు రెస్టారెంట్లు వినూత్న పద్ధతులు అనుసరిస్తాయి.
- ఓ రెస్టారెంట్ ఏకంగా బిర్యానీ ఏటీఎం ప్రారంభించింది.
- ఈ ఏటీఎం నుంచి బిర్యానీ ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చు? ఆసక్తికర వివరాలు..
డబ్బులు డ్రా చేసుకునే ఏటీఎంలు అందరికీ సుపరిచితమే. ఇటీవల బంగారం కాయిన్స్ విత్‌డ్రా చేసుకునే ఏటీఎంలు కూడా ప్రారంభమయ్యాయి. తాజాగా బిర్యానీ ఇచ్చే ఏటీఎం (Biryani ATM) ప్రారంభమైంది. అవును, దేశంలోనే మొట్టమొదటి ‘మ్యాన్‌లెస్ టేక్ అవే బిర్యానీ ఏటీఎం’ను చెన్నై నగరంలో ప్రారంభించారు. ఈ బిర్యానీ ఏటీఎంకు వెళ్లి స్క్రీన్‌పై కావాల్సిన బిర్యానీని ఎంచుకొని వివరాలు ఎంటర్ చేస్తే.. నిర్దేశిత బాక్స్ నుంచి బిర్యానీ బయటకు వస్తుంది. రెండే రెండు నిమిషాల్లో బిర్యానీ తీసుకొని వెళ్లిపోవచ్చు. ఈ సరికొత్త విధానం కస్టమర్లను తెగ ఆకట్టుకుంటోంది. సూపర్ ఐడియా అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
చెన్నైలోని ‘బై వీటు కళ్యాణం’ రెస్టారెంట్ ఈ బిర్యానీ ఏటీఎంను తీసుకొచ్చింది. ‘ఈ బిర్యానీ ఏటీఎంలో మెనూ ఉంటుంది. నచ్చిన ఫుడ్ ఎంచుకోవచ్చు. ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కార్డు లేదా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు’ అని నిర్వాహకులు చెబుతున్నారు..
ఎక్కువ సేపు నిరీక్షించాల్సిన పని లేకపోవడంతో.. బిర్యానీ లవర్స్ ఇక్కడికి క్యూ కడుతున్నారు. వెళ్తూ వెళ్తూ ఏటీఎం నుంచి బిర్యానీ తీసుకెళ్లడం చాలా బాగుందని అంటున్నారు. దీనికి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇలాంటి బిర్యానీ ఏటీఎంలను నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే బీవీకే రెస్టారెంట్ ఓనర్స్ భావిస్తున్నారు.
హైదరాబాద్ బిర్యానీ క్రేజ్
బిర్యానీకి నానాటికీ క్రేజ్ పెరుగుతోంది. గత ఏడాది దేశంలో బిర్యానీకి క్రేజ్, డిమాండ్ ఆల్ టైమ్ హైగా ఉందని వివిధ నివేదికల్లో వెల్లడైంది. అంతేకాదు, దక్షిణ భారతదేశంలో బాగా పాపులర్ అయిన ‘హైదరాబాద్ బిర్యానీ’కి ఇప్పుడు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తుండటం మరో విశేషం. 2020లో తమ యాప్ ప్రతి నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్‌లను అందుకుందని స్విగ్గీ వెల్లడించింది. తమ యాప్‌కి నిమిషానికి 186 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని జొమాటో తెలిపింది.