e-Passports in India

The e-passport is here! How to apply online?

e-Passports in India: ఈ-పాస్‌పోర్ట్‌ వచ్చేసింది! ఆన్‌లైన్‌లో ఎలా అప్లయ్‌ చేసుకోవాలంటే?

e-Passports in India

e-Passport in India : భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గత ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీన పాస్‌పోర్ట్‌ సేవా ప్రోగ్రాం (PSP) 2.0 ను ప్రారంభించింది. ఇందులో భాగంగా తాజాగా ఎలక్ట్రానిక్‌ పాస్‌పోర్ట్‌ (e-Passport) ప్రవేశపెట్టింది. భారతీయుల ప్రయాణాన్ని మరింత మెరుగుపరచడం, పాస్‌పోర్ట్‌ భద్రతను కల్పించడంలో భాగంగా ఈ-పాస్‌పోర్ట్‌ తీసుకొచ్చింది. ప్రస్తుతం పాస్‌పోర్టులు పేపర్‌ ప్రింటింగ్‌తో అందుబాటులో ఉన్నాయి. పాస్‌పోర్ట్‌ల భద్రతను మెరుగుపరచడం, ఇంటర్నేషనల్‌ ప్రయాణాలను స్ట్రీమ్‌లైన్‌ చేయడం, నకిలీ, ట్యాంపరింగ్‌ నుంచి పాస్‌పోర్ట్‌ హోల్డర్ల వ్యక్తిగత డేటాను సంరక్షించడం కూడా ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం.

ఈ-పాస్ పోర్ట్ ఏంటంటే?

ఇది సంప్రదాయ పేపర్‌ డాక్యుమెంట్‌ వంటిదే. ఈ-పాస్‌పోర్ట్‌ కవర్‌పై బంగారు వర్ణపు చిన్న సింబల్‌ ఉంటుంది. సంప్రదాయ పాస్‌పోర్ట్‌లకు భిన్నంగా ఇందులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (Radio-Frequency Identification - RFID) టెక్నాలజీతో ఈ-పాస్‌పోర్ట్‌ అనుసంధానమై ఉంటుంది. పాస్‌పోర్ట్‌ కవర్‌లో చిప్‌, యాంటెన్నా పొందుపరిచి ఉంటాయి. ఈ చిప్‌లోనే పాస్‌పోర్ట్‌ హోల్డర్ల వ్యక్తిగత, బయోమెట్రిక్‌ డాటా తదితర కీలకమైన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. దీంతో అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఈ-పాప్‌పోర్ట్‌ ద్వారా అథెంటికేషన్‌ సులభతరం అవుతుంది.

ప్రస్తుతం 13 నగరాల్లో మాత్రమే..

ప్రస్తుతం ఈ-పాస్‌పోర్ట్‌ సేవలు హైదరాబాద్‌ సహా 13 నగరాల్లో (నాగ్‌పూర్‌, భువనేశ్వర్‌, జమ్ము, గోవా, సిమ్లా, రాయ్‌పూర్‌, అమృత్‌సర్‌, జైపూర్‌, చెన్నై, సూరత్‌, రాంచీ, ఢిల్లీ) మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ ఏడాది ప్రథమార్థం ముగిసే నాటికి దేశంలోని అన్ని పాస్‌పోర్ట్‌ కేంద్రాల్లో ఈ-పాస్‌పోర్ట్‌ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. ఇప్పటికే పాస్‌పోర్ట్‌ ఉన్నవారు కచ్చితంగా అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పాస్‌పోర్ట్‌లు వాటి ఎక్స్‌పైరీ డేట్‌ వరకు సేవలందిస్తాయి. ఈ-పాస్‌పోర్ట్‌ అప్‌గ్రేడ్‌ అనేది ఆప్షనల్‌ మాత్రమే.

ఆన్‌లైన్‌లో ఈ-పాస్‌పోర్ట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

మీరు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈ-పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే చెన్నై, నాగ్‌పూర్, హైదరాబాద్, జైపూర్ మరియు ఇతర నగరాల్లోని ఎంపిక చేసిన పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (PSK) లేదా ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల (RPO) నుంచి కూడా పొందొచ్చు.

పాస్‌పోర్టు కోసం అధికారిక వెబ్‌సైట్‌ లేదా యాప్‌ mpassport seva app ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ యాప్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌, యాప్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంది. దీంతోపాటు ఆన్‌లైన్‌ అకౌంట్లు, యాప్‌లకు బలమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్‌ చేసుకోవాలి.

మొదట దరఖాస్తు చేసుకోవడానికి పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోండి.

మీ రిజిస్టర్డ్ ఐడిని ఉపయోగించి లాగిన్ అవ్వండి.

తాజా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోండి/ పాస్‌పోర్ట్ తిరిగి జారీ చేయండి” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

మీరు ఇంతకు ముందు పాస్‌పోర్ట్‌ లేకపోతే “తాజా” లేదా మీరు ఇంతకు ముందే పాస్‌పోర్ట్‌ ఉంటే “తిరిగి జారీ చేయండి” ఆప్షన్‌ ఎంచుకోండి.

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి.

మీ దరఖాస్తు రసీదును ప్రింట్ చేయండి లేదా సేవ్ చేయండి లేదా మీ అపాయింట్‌మెంట్ సమయంలో SMS నిర్ధారణను చూపండి.

షెడ్యూల్ చేసిన తేదీన అసలు పత్రాలతో మీరు ఎంచుకున్న PSK లేదా RPOని సందర్శించండి.

ప్రాసెస్ చేసిన తర్వాత మీ కొత్త ఈ-పాస్‌పోర్ట్ మీ రిజిస్టర్డ్ చిరునామాకు డెలివరీ చేయబడుతుంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.