seven-foot conductor

CM Revanth Reddy recognized the difficulty of a seven-foot conductor

ఏడడుగుల కండక్టర్‌ కష్టాన్ని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి.. బంపర్ ఆఫర్, ఆదేశాలు జారీ..!

CM Revanth Reddy recognized the difficulty of a seven-foot conductor

ఆరు అడుగుల బస్సులో ఏడు అడుగుల కండక్టర్ పడుతున్న కష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు. ఈ మేరకు ఆ కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఐడడుగుల కండక్టర్‌కు ఆర్టీసీ డిపార్ట్ మెంలో వేరే ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఎక్స్ వేదికగా వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అతడికి వేరే ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

ఎత్తు తక్కువున్న గుమ్మంలో నుంచి కాస్త వంగి రెండు మూడుసార్లు అటూ ఇటూ వెళ్తేనే ఇబ్బందిగా ఫీలవుతుంటాం.. అలాంటిది ఆరడుగుల బస్సులో ఏడడుగులున్న ఓ కండక్టర్ నిత్యం విధులు నిర్వహించటం ఎంత నరకంగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మెడపట్టేస్తే ఓ పక్కకు వంచేసి ఒక రోజు ఉండాలంటేనే చుక్కలు కనిపిస్తాయి. మరి రోజూ మెడపట్టేసినట్టుగా ఒవైపు తలవంచేసి విధులు నిర్వర్తిస్తున్న ఆ ఏడడుగుల కండక్టర్ బాధ వర్ణణాతీతం. కాగా.. ఆ కండక్టర్ బాధను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అర్థం చేసుకున్నారు. విధుల్లో భాగంగా ఎంత ఇబ్బంది పడుతున్నాడన్నది ఊహించిన సీఎం రేవంత్ రెడ్డి.. అతనికి ఆ కష్టం నుంచి విముక్తి కలింగించే దిశగా బంపర్ ఆఫర్ ఇచ్చారు.

ఏడడుగుల ఆర్టీసీ కండక్టర్

హైదరాబాద్‌ మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అమీన్ అహ్మద్ అన్సారీకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. అన్సారీకి శారీరకంగా ఉన్న ప్రత్యేకత వల్ల విధులు నిర్వర్తించటం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆర్టీసీలో మరొక తగిన ఉద్యోగాన్ని కేటాయించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు అన్సారీకి సరైన మరో ఉద్యోగాన్ని ఇవ్వాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

అయితే.. ఈ అమీన్ అహ్మద్ అన్సారీ అనే కండక్టర్.. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట షాహీన్‌నగర్‌లో నివసిస్తున్నాడు. అతని తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. 2021లో అనారోగ్యంతో తండ్రి మృతిచెందిన తరువాత, కారుణ్య నియామకం కింద ఇంటర్ విద్యను పూర్తి చేసిన అన్సారీకి RTCలో ఉద్యోగ అవకాశం కల్పించారు. దీంతో అన్సారీ మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా నియమితుడయ్యాడు.

అయితే, అన్సారీ పొడవు ఏకంగా 214 సెం.మీ. (సుమారు 7 అడుగులు) ఉండటం వల్ల ఆరడుగుల ఆర్టీసీ బస్సులో విధులు నిర్వర్తించడంలో అతడికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. RTC బస్సుల్లో సాధారణంగా లోపల ఎత్తు 195 సెం.మీ. మాత్రమే ఉండటంతో, అన్సారీ ఓవైపు పూర్తిగా తల వంచి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతిరోజూ సగటున ఐదు ట్రిప్పుల్లో 10 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. దీంతో అతడు మెడనొప్పి, వెన్నునొప్పి, నిద్రలేమి లాంటి సమస్యలతో బాధపడుతున్నాడు. ఎప్పటికప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుండటంతో, అన్సారీ తీవ్ర మనోవేదనకు లోనవుతున్నాడు.

ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రాగా.. ప్రయాణికులు, పలువురు నెటిజన్లు అతడికి RTCలో మరొక ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి, అతడి సమస్యను అర్థం చేసుకుని, తగిన శాఖలో తగిన ఉద్యోగం కల్పించాలని ఆదేశించారు.

ప్రస్తుతం ఈ నిర్ణయం ప్రజల మధ్య ప్రశంసలు అందుకుంటోంది. శారీరకంగా సవాలున్న ఉద్యోగులకు ప్రభుత్వం అండగా నిలవడం శ్లాఘనీయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి ఉదాహరణలు ప్రభుత్వానికి ప్రజలపై ఉన్న మానవతా దృక్పథాన్ని గుర్తింపు తెస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.