Pumpkin seeds that dissolve cholesterol

Pumpkin seeds that dissolve cholesterol

ధమనులకు అడ్డుపడి గుండెను ప్రమాదంలో పడేసే కొలెస్ట్రాల్‌ని కరిగించే గుమ్మడి గింజలు, అయితే తీసుకునే విధానం ఏంటో తెలుసా?

Pumpkin seeds that dissolve cholesterol

చెడు కొలెస్ట్రాల్ మన శరీరానికి హానికరం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, అది సిరల్లో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ధమనులను అడ్డుకుంటుంది.

శరీరంలో కొలెస్ట్రాల్ ఉండటం మంచిదే. అయితే.. ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే శరీరానికి ముప్పు పొంచి ఉంటుంది. ప్రస్తుత జీవనశైలి, పొల్యూషన్, అనారోగ్యకర ఆహారపు అలవాట్లతో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి చెడు కొలెస్ట్రాల్ (LDL), రెండు మంచి కొలెస్ట్రాల్ (HDL). మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) ఎక్కువైతేనే ప్రమాదం. చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే.. గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు, హైపర్‌టెన్షన్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అందుకే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ మన శరీరానికి హానికరం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, అది సిరల్లో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ధమనులను అడ్డుకుంటుంది. అయితే, గుమ్మడి గింజలు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడతాయని నిపుణులు అంటున్నారు. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి గుమ్మడి గింజల్ని ఎలా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ తగ్గించడానికి గుమ్మడి గింజలు

​గుమ్మడికాయ గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, జింక్ , యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో సాయపడతాయి. అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచడంలో తోడ్పడతాయి. అంతేకాకుండా గుమ్మడి గింజల్లో ఉండే ఫైబర్ శరీరం నుంచి అదనపు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది. అయితే, గుమ్మడి గింజల్ని ఎలా తినాలో ఇక్కడ తెలుసుకుందాం.

పచ్చి లేదా కాల్చిన గింజలు

​శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే గుమ్మడి గింజల్ని పచ్చిగా లేదా డైరెక్ట్‌గా తినవచ్చు. అయితే, కాల్చిన గింజలు అయితే బెస్ట్ అంటున్నారు నిపుణులు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా మంచి స్నాక్ ఐటమ్‌లా ఉపయోగపడతాయి. రోజూ ఒక గుప్పెడు (సుమారు 30 గ్రాములు) గుమ్మడికాయ గింజలు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు అంటున్నారు.

సలాడ్లు, స్మూతీల్లో కలపండి

సలాడ్, పెరుగు లేదా స్మూతీలలో గుమ్మడికాయ గింజలను జోడించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆహారంలో పోషకాలు పెరుగుతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడతాయి. మీరు కావాలంటే వీటిని ఓట్ మీల్‌తో కూడా కలిపి తినవచ్చు. దీనిని బ్రేక్ ఫాస్ట్‌లో తింటే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

గుమ్మడికాయ గింజల నూనె

గుమ్మడికాయ గింజల నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నూనెను సలాడ్ డ్రెస్సింగ్ లేదా వంటల్లో వాడుకోవచ్చు. అయితే, ఈ నూనెను అధిక ఉష్ణోగ్రతల వద్ద వండకూడదు.

గుమ్మడి గింజల పొడి

​గుమ్మడి గింజలను పొడిగా చేసుకోవచ్చు. ఈ పొడిని సూప్, కూరగాయలు లేదా షేక్స్‌లో కలిపి తినవచ్చు. సలాడ్లలో కూడా దీన్ని ఉపయోగించకోవచ్చు. కావాలంటే వంటలు లేదా కూరల్లో కూడా గుమ్మడి గింజల పొడిని యాడ్ చేసుకోవచ్చు. గుమ్మడికాయ గింజలను తినడానికి ఇది సులభమైన మార్గం. అంతేకాకుండా గుమ్మడి గింజల్ని అవిసె గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, బాదంతో కలిపి తినవచ్చు. దీన్ని రోజులో ఎప్పుడైనా సరే స్నాక్‌గా తినవచ్చు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

* గుమ్మడికాయ గింజలను పరిమిత పరిమాణంలో తినండి. ఎందుకంటే వాటిని అధికంగా తినడం వల్ల కడుపు సమస్యలు వస్తాయి.


* మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే, ఆహారంలో గుమ్మడికాయ గింజలను చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి.

* గుమ్మడికాయ గింజలను తాజాగా ఉంచడానికి ఎల్లప్పుడూ గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి.

గమనిక

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.