Poison in the water tank

Poison in the water tank.. Why did they want to kill the school children?

వాటర్ ట్యాంకులో విషం.. స్కూల్ పిల్లల్ని ఎందుకు చంపాలనుకున్నారు?

Poison in the water tank.. Why did they want to kill the school children?

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మంటలం ధరంపూరి గవర్నమెంట్ స్కూల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలలోని 30 మంది విద్యార్థులను చంపడానికి గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారు. నీటి ట్యాంక్‌లో పురుగుల మందు కలపడంతో పాటు, మధ్యాహ్న భోజనం వండే పాత్రలపై కూడా విషం చల్లారు. సిబ్బంది సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.

ఆదిలాబాద్ జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇచ్చోడ మండలం ధరంపూరిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ప్రాణాలను తీయడానికి కొందరు గుర్తు తెలియని దుండగులు కుట్ర పన్నారు. దాదాపు 30 మంది పిల్లలను హతమార్చాలని చూశారు. ఇందుకోసం పాఠశాలలోని నీటి ట్యాంక్‌లో పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజనం వండే పాత్రలపై కూడా విషం చల్లారు. అయితే, పాఠశాల సిబ్బంది వెంటనే గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఇక అసలు విషయంలోకి వెళితే.. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మంది పిల్లలు చదువకుంటున్నారు. అయితే పిల్లల్ని చంపేందుకు కొందరు దుర్గార్గులు విష ప్రయోగం చేశారు. విద్యార్థులు తాగే నీటి ట్యాంక్‌లో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా పురుగుల మందులు చల్లారు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అందర్ని తీవ్ర ఆందోళనకు గురి చేసింది.

పాఠశాలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో పాఠశాలలోని వంట గదికి సిబ్బంది తాళాలు వేసి వెళ్లారు. సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన సిబ్బంది.. వంట చేసే పాత్రలు కడిగేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో దుర్వాసన, నురగలు వచ్చాయి. అసలు ఏంటా అని.. చాలా సేపు పరిశీలించారు. చూస్తే పురుగుల మందు వాసన వలె ఉండటంతో అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల హెడ్‌ మాస్టర్‌, సిబ్బందికి చెప్పారు. దీంతో అంతా కలిసి ఏం జరిగిందో అని చూస్తున్న సమయంలోనే అక్కడే ఓ పురుగుల మందు డబ్బా కనిపించింది. అలాగే నీటి నుంచి కూడా దుర్వాసన వస్తుండటంతో నీటిని పరిశీలించగా.. దుండగులు తాగు నీటి ట్యాంక్‌లోనూ పురుగుల మందు కలిపినట్లుగా సిబ్బంది గుర్తించారు.

దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది.. విద్యార్థులను తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. మధ్యాహ్న భోజనం వండలేదు. ఈ ఘటనపై ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరైన సమయానికి పాఠశాల సిబ్బంది గుర్తించి మధ్యాహ్న భోజనం వండకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. కాగా, ఈ ఘటనపై పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు మండిపడుతున్నారు. అసలు స్కూల్‌ పిల్లలపై విష ప్రయోగం చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని.. చిన్న పిల్లలు ఏం పాపం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.