Even with a single rupee, lizards and cockroaches will not enter your house.
Home Tips: ఒక్క రూపాయితో మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా బల్లులు, బొద్దింకలు రావు.
ప్రతి ఇంట్లో బల్లులు, బొద్దింకలు ఉండటం సాధారణం. అయితే, ఒక్కోసారి అవి వంట చేసే ప్రదేశం, పడుకునే ప్రదేశంలో తిరుగుతూ కాస్త ఇబ్బందులకు గురిచేస్తుంటాయి.
కొన్ని జాగ్రత్తలు తీసుకున్న బొద్దింకలు బల్లులు తరమాలంటే కష్టతరం అవుతుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే బల్లులు త్వరగా ఇంట్లో నుంచి పారిపోతాయి. కేవలం రూపాయితో ఈ బల్లులు, చీమలను తరమొచ్చు.. ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం
రూపాయి షాంపూ కొనుగోలు చేసి అందులో డేటాలు కూడా వేయాలి. ఇందులోనే మీరు బేకింగ్ సోడా, వెనిగర్ కూడా వేసి బాగా కలపాలి. బొద్దింకలు, బల్లులు, చీమలు తరిమికొట్టాలంటే ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. ఇవి సులభంగా ఇంట్లో ఉంటాయి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఇందులో మరీ కాస్త గ్లాసు నీటిని కూడా కలపాలి. అయితే దీన్నంతా ఒక స్ప్రే బాటిల్‌లో వేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో వేసిన తర్వాత కిటికీలు, అద్దాలు ,వంటగది బల్లులు తిరిగే ప్రాంతాల్లో దీన్ని స్ప్రే చేస్తూ ఉండాలి. ఈ ఘాటు వాసనకు బొద్దింకలు, బల్లులు త్వరగా పారిపోతాయి. చీమలు కూడా ఈ షాంపూ, బేకింగ్ సోడా వాసన అంటే అసలు గిట్టదు. ప్రధానంగా ఇందులో డెట్టల్ ఘాట వాసనకు అవి పారిపోతాయి. ఇష్టపడవు వారానికి ఒకసారి ఈ రెమిడీ ప్రయత్నించడం వల్ల బల్లులు, బొద్దింకలు మీ ఇంటి చుట్టుముట్టు కూడా కనబడవు. మీ ఇంటి నుంచి దూరంగా అవి పారిపోతాయి.
వీటిని ఒక టిష్యూ పేపర్ పై చల్లి కూడా బొద్దింకలు, బల్లులు తిరిగే ప్రాంతంలో వేసి చూడండి. దీనితో పాటు లవంగం పొడి, మిరియాల పొడిని కూడా సమపాళ్లలో కలిపి ఇందులో బేకింగ్ సోడా మరికాస్త నీళ్లు పోసి కలిపి బల్లులు, బొద్దింకలు తిరిగే ప్రాంతంలో స్ప్రే చేయవచ్చు. ఇది కూడా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. ఈ వాసన ప్రధానంగా పడవు. ఇక ఎలుకలు తిరిగే ప్రాంతంలో మిరియాల పొడిని వేసి పెట్టడం వల్ల అవి ఆ ఘాటు వాసనకు త్వరగా బయటికి పారిపోతాయి. ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే ఇంట్లో ఉన్న బల్లులు, బొద్దింకలు మీ కంటికి కనిపించకుండా పారిపోతాయి.

