Exam Results

10th Class, Inter results in Telugu states ever explanation.

 Exam Results: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడో వివరణ.

10th Class, Inter results in Telugu states ever explanation.

Tenth, Inter Results Date 2025 Updates: తెలుగు రాష్ట్రాల్లో పదోతరగతి, ఇంటర్ బోర్డు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షా సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ఫలితాల విడుదల కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు.

గతంలో టెన్త్, ఇంటర్మీడియట్ బోర్డులు పరీక్షా ఫలితాల కోసం అనుసరించిన సరళిని, అధికారిక వర్గాల సమాచారాన్ని పరిశీలిస్తే టెన్త్, ఇంటర్ ఫలితాలు ఈ తేదీల్లో రిలీజ్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది..

ఏపీ టెన్త్ ఫలితాల రిలీజ్ డేట్..

ఏపీలో పదోతరగతి పరీక్షలు మార్చి 17 నుంచి మొదలై మార్చి 31న పూర్తయ్యాయి. ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షా ఫలితాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్ఢు స్థాయిలో 7 రోజుల్లోనే అంటే ఏప్రిల్ 9లోగా మూల్యాంకనం పూర్తి చేసేందుకు ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అనుకున్నట్టే జరిగితే ఈ నెల చివరి వారంలో ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలవుతాయి లేదంటే మే తొలివారంలో రిలీజ్ చేసే అవకాశముంది. ఏపీ పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు వాట్సాప్‌ నెంబర్ 9552300009 లేదా అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ టెన్త్ ఫలితాల రిలీజ్ డేట్.

తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి మొదలయ్యాయి. ఏప్రిల్ 4 వరకూ జరగనున్నాయి. తెలంగాణలో కూడా ఏపీలో లాగే పదో తరగతి పరీక్షా ఫలితాలు ఏప్రిల్ నెలాఖరు కల్లా వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ టెన్త్ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ - https://www.bse.telangana.gov.in లో తనిఖీ చేసుకోండి.

ఏపీ ఇంటర్‌ ఫలితాల తేదీ 

ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏప్రిల్‌ 12-15 తేదీల మధ్య ఇంటర్ ఫలితాలను(AP Inter Results) విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీల మధ్య ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంటర్ పరీక్షల మూల్యాంకనం వేగంగా కొనసాగుతోంది. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫలితాలను కంప్యూటరీకరణ చేసేందుకు 5-6 రోజుల సమయం పడుతుంది. ఈ సంవత్సరం టెన్త్, ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల చేసినట్టుగానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాలు కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. వాట్సాప్‌ నంబర్ 9552300009 లేదా BIEAP అధికారిక వెబ్‌సైట్‌ https://bie.ap.gov.in/ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు.

తెలంగాణలో ఇంటర్‌ రిజల్ట్స్‌

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5న మొదలై 25తో ముగిశాయి. ప్రస్తుతం మూల్యాంకన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TSBIE)అధికారిక వర్గాల సమాచారం. ఫలితాల కోసం tgbie.cgg.gov.in లో చెక్ చేసుకోవచ్చు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.