You can change the surname on your Aadhaar card in minutes.
Aadhaar Card : మీ ఆధార్ కార్డులో ఇంటిపేరు నిమిషాల్లో మార్చుకోవచ్చు.. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో బై స్టెప్ ప్రాసెస్..! ఎలా చేయాలో వివరణ.
ఆధార్ కార్డు : ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన ఐడెంటిటీ కార్డు. భారతీయ పౌరుడిగా గుర్తింపు పొందే డాక్యుమెంట్. దేశంలో ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ఒకటిగా మారింది.
బ్యాంకుల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతిచోటా అవసరం.
కానీ, ఆధార్ కార్డులోని ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే.. మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా వివాహం తర్వాత చాలా మంది మహిళలు తమ ఇంటిపేరును మార్చుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఆధార్ కార్డులో కొన్ని మార్పులు తప్పక చేయాలి.
ఆధార్ కార్డులో ఇంటిపేరు ఎందుకు మార్చాలంటే?
చాలామంది మహిళలు తమ వివాహం తర్వాత ఇంటిపేరు మారిపోతుంది. మీ పాత ఇంటిపేరు ఆధార్ కార్డులో ఉంటే.. పాన్ కార్డ్, ఓటరు ఐడీ, బ్యాంక్ అకౌంట్ సమాచారానికి సంబంధించి ఏదైనా అవసరం వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎదుర్కోవలసి రావచ్చు. ప్రభుత్వ సేవలను కూడా పొందలేరు. అందుకే ఆధార్‌లో ఇంటిపేరును అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం.
ఆధార్ ఇంటిపేరు మార్చేందుకు అవసరమైన డాక్యుమెంట్లు
ఆధార్ కార్డులో ఇంటిపేరు మార్చడానికి అతి ముఖ్యమైన డాక్యుమెంట్ వివాహ ధృవీకరణ పత్రం. మీరు ఇంటిపేరు మార్చడానికి దరఖాస్తు సమయంలో ఈ డాక్యుమెంట్ జత చేయాలి.
మీరు కొన్ని ఇతర డాక్యుమెంట్లను కూడా ఉపయోగించవచ్చు.
భర్త పేరుతో పాస్‌పోర్ట్,
భర్త పేరుతో పాన్ కార్డ్
ఆధార్‌లో భర్త పేరును చేర్చేందుకు మీ ఇంటిపేరును మార్చడానికి మీరు బ్యాంక్ స్టేట్‌మెంట్/పాస్‌బుక్ వంటి డాక్యుమెంట్లను కూడా సమర్పించవచ్చు.
మీ ఇంటి నుంచి ఆధార్‌లో ఇంటిపేరును ఆన్‌లైన్‌లో ఎలా మార్చాలి?
UIDAI అధికారిక వెబ్‌సైట్ (MyAadhaar) పోర్టల్‌కి వెళ్లి మీ ఆధార్ నంబర్, OTP ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
ఆ తర్వాత అప్‌డేట్ ఆధార్ సెక్షన్‌కు వెళ్లి ఆపై అప్‌డేట్ చేయాల్సిన పేరు ఆప్షన్‌ను ఎంచుకోండి.
కొత్త వివరాలు అంటే.. మీ కొత్త ఇంటిపేరు, ఇతర అవసరమైన డేటాను ఎంటర్ చేయండి.
మీ ఇంటిపేరు మార్పునకు గాడ్జెట్ నోటిఫికేషన్, వివాహ ధృవీకరణ పత్రం లేదా ఇతర చట్టపరమైన డాక్యుమెంట్లు అవసరం.
మీరు ఆధార్ అప్‌డేట్ కోసం రూ. 50 రుసుము చెల్లించాలి.
ఆ తర్వాత మీ వివరాలను రివ్యూ చేసి రిక్వెస్ట్ సమర్పించాలి. సేవా అభ్యర్థన సంఖ్య (SRN)ను సేవ్ చేయండి. మీ అప్‌డేట్ రిక్వెస్ట్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.
ఆధార్ కేంద్రం ద్వారా ఇంటిపేరును ఆఫ్‌లైన్‌లో ఎలా మార్చుకోవాలి?
మీ సమీపంలోని ఆధార్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి, ఫారమ్ నింపి మీ పేరు, ఆధార్ నంబర్ వివరాలను నింపండి.
వివాహ ధృవీకరణ పత్రం వంటి అవసరమైన డాక్యుమెంట్ల ఫోటోకాపీలను సమర్పించండి.
ధృవీకరణ కోసం మీ వద్ద ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా ఉండాలని గుర్తుంచుకోండి.
ఆ తర్వాత, కొత్త ఫొటో, ఫింగర్ ఫ్రింట్ లేదా బయోమెట్రిక్ డేటాను తీసుకుంటారు.
అప్పుడు మీ అప్డేట్ కోసం మీరు రూ. 50 రుసుము చెల్లించాలి.
దరఖాస్తును సమర్పించిన తర్వాత మీరు UIDAI వెబ్‌సైట్‌ను విజిట్ చేసి స్టేటస్ చెక్ చేయవచ్చు.