wallSit

It is not a punishment of wall Sit.

గోడకుర్చీ ఇది పనిష్‌మెంట్ కాదు, బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ దూరం చేసి బీపిని తగ్గించే ఎక్సర్‌సైజ్, ఇంకేం లాభాలంటే..

wall Sit
మజిల్ పవర్ పెంచడానికి మీరు మంచి వర్కౌట్ చేయాలనుకుంటున్నారా అందుకోసం మీరు వాల్ సిట్స్ ఎక్సర్‌సైజ్ చేయొచ్చు. దీని వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటో తెలుసుకోండి.

చిన్నప్పుడు చాలా మంది హోమ్ వర్క్ సరిగా చేయకపోయినా, అల్లరి చేసినా స్కూల్లో టీచర్స్ పనిష్‌మెంట్ ఇచ్చేవారు. అందులో గోడ కుర్చీ ఒకటి. దీనిని ఇంగ్లీష్‌లో వాల్ సిట్ అంటారు. ఒకప్పుడు ఇచ్చే పనిష్‌మెంట్ కూడా మనకి ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తుందని తెలిసిందిగా. ఇక విషయానికొస్తే వాల్ సిట్ అనేది కండరాల బలాన్ని పెంచే ఎక్సర్‌సైజ్. బాడీ కదలకుండా ఒకే పొజిషన్‌లో ఉండి చేసే ఈ ఎక్సర్‌సైజ్‌ని ఐసోమెట్రిక్ ఎక్సర్‌సైజ్ అని కూడా అంటారు. బర్పీస్, డెడ్‌లిఫ్ట్ వంటి వర్కౌట్స్ మజిల్‌ ఆరోగ్యానికి మాత్రమే కాదు. కోర్ బలం, లోయర్ బాడీ పవర్‌కి హెల్ప్ చేస్తాయి. అసలు ఈ ఎక్సర్‌సైజ్ ఎలా చేయాలి. దీని వల్ల ఏయే లాభాలో తెలుసుకోండి.

ఎలా చేయాలి

ముందుగా శరీరాన్ని గోడకి ఆన్చి కుర్చీలో కూర్చున్నట్లుగా కాసే కదలకుండా అలానే ఉండాలి. ఇందుకోసం ముందుగా పాదాలను కనీసం అడుగు దూరంలో ఉండి నిలబడాలి. ఆ తర్వాత మోకాళ్ళని వంచుతుంది. శరీర మధ్య భాగాన్ని భూమికి సమాంతరంగా చేసి నిలబడాలి. శరీరంలోని పై భాగం గోడకు ఆన్చి చేతులు ముందుకి చాపి గోడకుర్చీ వేసి కూర్చోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉండాలి.

కీళ్లనొప్పులు

కొంతమందికి అదేపనిగా కీళ్లనొప్పులు వస్తుంటాయి. అలాంటివారికి గోడ కుర్చి మంచి ఎక్సర్‌సైజ్ దీని వల్ల కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. కీళ్లు బలంగా మారతాయి. దీంతో కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి. దీని వల్ల వయసు పెరిగేకొద్దీ వచ్చే కీళ్లు, కాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.

జీర్ణక్రియకి

ఈ వర్కౌట్ చేయడం వల్ల జీర్ణక్రియ స్పీడ్‌గా మారుతుంది. అజీర్ణం, బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలు తగ్గి జీర్ణవ్యవస్థ మెరుగ్గా మారుతుంది. రెగ్యులర్‌గా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. జీర్ణసమస్యలకి మందులు వాడే బదులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోనే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోగలం.

బాడీ పోశ్చర్

ఈ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల చాలా కండరాలు ఒకేసారి పనిచేస్తాయి. శరీరం కింది బాగా ఎక్కువగా కష్టపడినప్పుడు కడుపులోని కండరాలు వెన్నెముకకి సపోర్ట్‌గా నిలుస్తాయి. దీంతో బాడీ పోశ్చర్ మెరుగ్గా ఉంటుంది.

రక్తపోటు

వాల్ సిట్ చేయడం వల్ల కండరాలకు మంచిది. ఇది తెలిసిన విషయమే. కానీ, దీనిని చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఓ అధ్యయనంలో తేలిన విషయం ఏంటంటే ఈ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఇది ఇది హై ఇంటెన్సిటి ఇంటర్వెల్ ట్రైనింగ్ ఎక్సర్2సైజ్. ఏరోబిక్స్, డైనమిక్ స్ట్రెంథ్ కంటే చాలా మంచిది. వాల్ సిట్ చేయడం వల్ల సిస్టోలిక్, డయాస్టొలిక్ రక్తపోటు తగ్గుతుంది.

డీటాక్సీఫై

ఈ వర్కౌట్ చేయడం వల్ల శరీర భాగాల్లో లింపాటిక్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది ఇమ్యూనిటీని పెంచడమే కాదు. బాడీని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీంతో అవసరం లేని చాలా వరకూ టాక్సిన్ దూరమై బాడీ హెల్దీగా మారుతుంది.

గమనిక :ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.