why wells are round?

Do you know why wells are round?

బావులు గుండ్రంగానే ఎందుకుంటాయో తెలుసా? దీని వెనుక ఉన్న కారణాలేంటంటే

Do you know why wells are round?

ఒకప్పుడు పల్లెల్లో బావులు ఎక్కువగా ఉండేవి. అక్కడి ప్రజలు నీటి అవసరాల కోసం ఎక్కువగా బావుల మీద ఆధారపడేవారు. దాదాపు అన్ని బావులు వృత్తాకార ఆకారంలో అదే గుండ్రంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా బావులు చతురస్రాకారంలో లేదా త్రిభుజాకారంలో ఎందుకు ఉండవు అని ఆలోచించారా? ఎందుకు బావులు గుండ్రగానే ఉంటాయి. భవనాలు చతురుస్రాకారంలో, రోడ్లు స్ట్రైట్‌గా ఉన్నప్పుడు బావులు ఎందుకు గుండ్రగా ఉన్నాయి? ఈ ప్రశ్నకు సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం. సమాధానాలు సరళంగా అనిపించినా.. అంతే ఆశ్చర్యకరంగా ఉంటాయి.

నీటిపై ఒత్తిడి సమానంగా

ఒక బావి నీటితో నిండి ఉన్నప్పుడు, దాని గోడలపై చుట్టూ సమాన ఒత్తిడి ఉంటుంది. గుండ్రని ఆకారం కారణంగా ఈ పీడనం సమతుల్యంగా ఉంటుంది. ఇది బావి గోడలను మరింత బలంగా, మన్నికైనదిగా చేస్తుంది. బావి చతురస్రాకారంలో లేదా త్రిభుజాకారంలో ఉంటే, మూలల్లో నీటి పీడనం ఎక్కువగా ఉంటుంది. దీంతో క్రమంగా ఆ భాగాలు దెబ్బతింటాయి. క్రమక్రమంగా పగుళ్లు ఏర్పడి బావి గోడ కూలిపోయేలా చేస్తాయి.

బలమైన నిర్మాణం

ఇంజనీరింగ్ నియమాలు వృత్తాకార నిర్మాణాలు బలంగా, ఎక్కువ కాలం ఉంటాయని చెబుతాయి. పురాతన కాలంలో నిర్మించిన కోటలు, చర్చిలు, మసీదులలో గోపురాలను ఉపయోగించటానికి కారణం ఇదే. గోడలు గుండ్రంగా ఉన్నప్పుడు, అవి బాహ్య ఒత్తిడిని బాగా తట్టుకోగలవు. పగుళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇదే సూత్రం బావులకు కూడా వర్తిస్తుంది.

నిర్మించడం, శుభ్రపర్చడం సులభం

చతురస్రాకార బావుల కంటే గుండ్రని బావులను నిర్మించడం సులభం. ఎవరైనా బావి తవ్వినప్పుడు, చుట్టూ తిరగుతూ తవ్వుతారు. ఎందుకంటే అలా తవ్వడం సులభం. దీంతో ఆటోమేటిక్‌గా సర్క్యూలర్ షేప్ వస్తుంది. అంతేకాకుండా బావులు గుండ్రంగా ఉండటం వల్ల దానిని శుభ్రం చేయడం సులభం అవుతుంది. బావి చతురస్రాకారంలో ఉంటే మూలాల్లో మురికి పేరుకుపోతుంది. శుభ్రం చేయడం కష్టం అవుతుంది.

తక్కువ ప్రదేశంలో ఎక్కువ లోతు

గుండ్రని ఆకారపు బావులను నిర్మించడానికి తక్కువ ప్రదేశం చాలు. తక్కువ ప్రదేశం అయినప్పటికీ వాటిని మరింత లోతుగా నిర్మించవచ్చు. బావి చతురస్రాకారంలో ఉంటే, దాని నాలుగు గోడలు, మూలలకు మరింత మద్దతు ఇవ్వడానికి ఎక్కువ ఇటుకలు, రాళ్ళు లేదా సిమెంట్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది ఖర్చును కూడా పెంచుతుంది. అందుకే పరిమిత వనరులు అందుబాటులో ఉన్న పాత రోజుల్లో ప్రజలు గుండ్రని బావులను నిర్మించుకోవడానికి ఇష్టపడేవారు.

సహజ ప్రవాహం

నీటిని నిల్వ చేయడానికి, దానిని సహజంగా మళ్లించడానికి బావి ఒక గొప్ప మార్గం. బావి గుండ్రంగా ఉన్నప్పుడు, నీటి ప్రవాహం ఎటువంటి అడ్డంకులు లేకుండా జరుగుతుంది. దీని కారణంగా బావి లోపల నీరు చాలా కాలం పాటు శుభ్రంగా ఉంటుంది. బావి చతురస్రాకారంలో ఉంటే, మూలల్లో మురికి, బురద పేరుకుపోయి నీరు కలుషితమయ్యే ప్రమాదం పెరుగుతుంది.

ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ

గుండ్రని బావులు భూకంపాలు, బురద స్లైడ్ వంటి ప్రకృతి విపత్తుల్ని కూడా తట్టుకోగలవు. నేల కంపించినప్పుడు, గుండ్రని బావి దాని సమతుల్యతను కాపాడుకుంటుంది. అందుకే అది కూలిపోయే అవకాశం తక్కువ. చుట్టుపక్కల ఉన్న ఇతర నిర్మాణాలు కూలిపోయినప్పటికీ, చాలా పాత బావులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటానికి ఇదే కారణం.

గమనిక
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.