Usage of Purified water

When the water is purified, the water can be used properly without being thrown away as waste

వాటర్ ప్యూరిఫై అయినప్పుడు వచ్చే నీటిని వేస్ట్‌గా పారబోయకుండా చక్కగా వాడుకోవచ్చు, ఏమేం చేయొచ్చొంటే..

Usage of Purified water

ప్రజెంట్ చాలా మంది వాటర్‌ ప్యూరిఫైయర్‌ని వాడుతున్నారు. అయితే, వాటర్ ప్యూరిఫై అయ్యేటప్పుడు చాలా నీరు వేస్ట్‌గా పోతుంది. అలా కాకుండా ఈ నీటిని కూడా చక్కగా వాడుకోవచ్చు. అదెలా అంటే

నీరు చాలా ముఖ్యం. కానీ, చాలా మంది దీనిని వేస్ట్‌ చేసేస్తుంటారు. వాడేనీరు, తాగునీరు  నీరైనా మనం సక్రమంగా వినియోగిస్తేనే అది ముందుతరాలకి కూడా పనికొస్తుంది. అది తెలియక చాలా మంది వేస్ట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వాటర్‌ని ప్యూరిఫై చేస్తుంటారు. ఇదివరకటి రోజుల్లో బావులు, ట్యాప్ వాటర్ వాడే వారు. కానీ, పెరిగిన అవగాహనతో బయట ప్యూరిఫై అయిన నీటిని కొని తెచ్చి వాడేవారు. అయితే, ఇదంతా ఎందుకని ఇప్పుడు చాలా మంది నీటిని ప్యూరిఫై చేసేందుకు ఇంట్లోనే ప్యూరిఫైయర్స్ తీసుకొచ్చి పెడుతున్నారు. వీటితో నీటిని ప్యూరీఫై చేసి తాగుతున్నారు. అంతా బానే ఉంది. కానీ, ప్యూరిఫై జరిగేటప్పుడు నీరు బయటికి వస్తుంది. ఈ నీటిని చాలా మంది పారబోస్తుంటారు. అయితే, వీటిని పారబోయకుండా కొన్ని ఇంటి పనులకి వాడొచ్చు. అవేంటో చూడండి..

కూలర్స్‌లో పోయడం

ఇదెలాగూ సమ్మర్. ఈ టైమ్‌లో చాలా మంది కూలర్స్ వాడుతుంటారు. ఈ కూలర్స్‌లో నీటిని పోస్తుంటారు. దానికోసం ఇదే నీటిని కూడా పోయొచ్చు. దీంతో చల్లని ఆస్వాదించొచ్చు. అదే విధంగా, బాత్‌రూమ్స్ క్లీన్ చేయడానికి కూడా ఈ నీటిని చక్కగా వాడుకోవచ్చు. అయితే, దీనిని స్నానానికి వాడాలనుకుంటారు. కానీ, అలా వాడొద్దు. దీనికి కారణం ఇందులో TDS ఎక్కువగా ఉండడమే.

కారు క్లీన్ చేయడం

అదే విధంగా, ఇంట్లోని కారు, బైక్స్ కడగడానికి నీటిని వాడతారు. అవి సెపరేట్ నీటి బదులు.. ఇలా వేస్ట్‌గా పారబోసే నీటితో క్లీన్ చేయొచ్చు. దీని వల్ల నీరు వేస్ట్ అవ్వదు. మన ఇంట్లోని బైక్స్, కార్స్ కూడా చక్కగా క్లీన్ అవుతాయి.

గిన్నెలు కడగడానికి

ఇలా వాటర్ ప్యూరిఫై అవ్వగా వచ్చిన వేస్ట్ నీటిని పారబోయకుండా వాటితో గిన్నెల్ని క్లీన్ చేయొచ్చు. ఈ నీటిని ఓ టబ్ లేదా బకెట్‌లో ఉంచి ఆ నీటితో క్లీన్ చేయండి. దీంతో నీరు వేస్ట్ అవ్వవు. వాటిని సరిగా వాడామన్న సాటిస్‌ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి, రెగ్యులర్‌గా ఇంట్లోని గిన్నెలు క్లీన్ చేయొచ్చు.

బట్టలు ఉతకడం

ఇంట్లో బట్టలు ఉతకడానికి కూడా ఈ నీటిని చక్కగా వాడుకోవచ్చు. దీనికోసం సెపరేట్‌గా పెట్టిన బకెట్‌లో వాటర్‌ని స్టోర్ చేసుకుని ఆ నీటితో బట్టల్ని చక్కగా క్లీన్ చేయండి. ఈ నీటితో బట్టలు ఉతకడం వల్ల నీరు వేస్ట్ అవ్వదు. నానబెట్టడం, నీటిలో తీయడం వంటి వాటన్నింటికీ ఈ నీటిని వాడుకోవచ్చు.

చెట్లకి పోయడం

చెట్లకి ఏ నీరు అయినా ఒకటే. కాబట్టి, ప్యూరిఫై అవ్వగా వచ్చే వేస్ట్ నీటిని పారబోయకుండా గార్డెనింగ్‌కి వాడండి. ఇవి చక్కగా సెపరేట్ బకెట్, టబ్‌లో స్టోర్ చేసి వాటిని వాడుకోండి. దీంతో నీరు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఉదయం, సాయంత్రం చెట్లకి ఉన్న అవసరాన్ని బట్టి నీటిని పోయొచ్చు.

నేల తుడవడానికి

అదే విధంగా, ఈ నీటితో ఇంట్లోని ఫ్లోర్ క్లీన్ చేయొచ్చు. మన ఇంట్లోని ఫ్లోర్ క్లీన్ చేయడానికి వేస్ట్ నీరు చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీనికోసం సెపరేట్‌గా మళ్లీ నీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఫ్లోర్ అయినా కూడా ఈ నీటితో చక్కగా క్లీన్ చేసుకోవచ్చు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.