8th Pay Commission for Central Government Employees

8th Pay Commission for Central Government Employees, Pensioners: Key Update

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ కోసం 8వ వేతన కమిషన్: కీలక అప్ డేట్

8th Pay Commission for Central Government Employees, Pensioners: Key Update

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స் కోసం 8వ వేతన కమిషన్ ని ఏప్రిల్ నాటికి ఏర్పాటు చేసే అవకాశం ఉందని కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి మనోజ్ గోయల్ తెలిపారు. ఈ కమిషన్ ఏర్పాటు వలన 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్స్ లబ్దిపొందనున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ కి గుడ్ న్యూస్. 8వ వేతన కమిషన్ కి సంబంధించిన పెద్ద అప్ డేట్ లభించింది. గత నెల అనగా జనవరిలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన కమిషన్ ని ప్రారంభించడం జరిగింది. అయితే ప్రభుత్వం 8వ వేతన కమిషన్ ని ఎప్పుడు అధికారికంగా ఏర్పాటు చేయనున్నారని, అలాగే దీని ద్వారా తాము ఎలాంటి ప్రయోజనాలని పొందనున్నామో అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ఈ విషయంపై కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖకి చెందిన ఎక్స్పెండిచర్ సెక్రటరీ అయిన మనోజ్ గోయల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిలో భాగంగా ఏప్రిల్ నాటికి 8వ వేతన కమిషన్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని గోయల్ తెలిపారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే దేశవ్యాప్తంగా ఉన్న 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే 65 లక్షల మంది పెన్షనర్స్ లబ్ది పొందనున్నారు. మరొకవైపు మూల ధన వ్యయం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు గోయల్ తెలిపారు.

8వ వేతన కమిషన్ కారణంగా వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఎలాంటి అదనపు భారం ప్రభుత్వంపై పడే అవకాశం లేదని, 8వ వేతన కమిషన్ ఏర్పాటు అవ్వడం, అనంతరం కమిషన్ తమ నివేదికని ప్రభుత్వానికి సమర్పించడం, ఆ తరువాత ప్రభుత్వం దానిని ప్రాసెస్ చేయడం ఇవ్వని జరగడానికి సమయం పడుతుందని, కావున ఏప్రిల్ నుంచి ప్రారంభం అయ్యే ఆర్ధిక సంవత్సరం వరకు ఎలాంటి ఆర్ధిక భారం ప్రభుత్వంపై ఉండదని గోయల్ తెలిపారు.

ఇటీవల కేంద్ర ఆర్ధిక శాఖ సహాయక మంత్రి అయిన పంకజ్ చౌదరి రాజ్యసభలో మాట్లడుతూ, 8వ వేతన కమిషన్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, దీనిని సంబంధించిన విషయాలపై ప్రభుత్వం త్వరలోనే తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.

ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ని 1.92 నుంచి 2.08 మద్య పెంచే అవకాశం ఉందని, ఒకవేళ ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ. 18,000 నుంచి రూ. 37,440 మధ్య పెరిగే అవకాశం ఉందని ఉద్యోగులు, పెన్షనర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.