Health Insurance

Removal of age limit for health insurance policy.

Health Insurance : IRDAI కీలక నిర్ణయం.. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ఏజ్ లిమిట్ తొలగింపు..

Removal of age limit for health insurance policy.

ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి ఐఆర్ డీఏఐ నిబంధనలు మార్చింది. 65 ఏళ్ల వయో పరిమితిని తొలగించింది. ఇకపై సీనియర్ సిటిజన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని బీమా సంస్థలను ఆదేశించింది. అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉండేవారికి కూడా పాలసీ అందించాలని స్పష్టం చేసింది.

బీమా నియంత్రణ సంస్థ IRDAI (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య బీమా పాలసీ నిబంధనలను సవరించింది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు గరిష్ట వయోపరిమితి 65 ఏళ్ల నిబంధనను తొలగించింది. అంటే ఇకపై 65 ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య పాలసీని ఇన్సూరెన్సు కంపెనీలు అందించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఐఆర్ డీఏఐ తెలిపింది. పాలసీ నిబంధన మార్పు తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల స్పందనను గమనించనున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం దేశంలోని అన్ని ఆరోగ్య బీమా సంస్థలు 65 ఏళ్లు దాటిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి నిరాకరిస్తున్నాయి. అలాగే 60 ఏళ్లు దాటిన వారు ఒక్కసారి ఇన్సూరెన్స్ క్లెయిట్ చేసుకున్న తర్వాతా వారికి రెనువల్ సుదాపాయాన్ని కల్పించడం లేదు. అలాగే పెద్ద మొత్తంలో కవరేజీ తీసుకోవాలనునేవారికి ముందస్తుగా వైద్య పరీక్షలకు నిర్వహించి దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్లు గుర్తిస్తే పాలసీని నిరాకరిస్తున్నాయి.

దీంతో ఎక్కువ మందికి హెల్త్ ఇన్సూరెన్స్ సేవలు అందుబాటులోకి తెచ్చేలా ఐఆర్ డీఏఐ నిబంధలను సవరించింది. క్యాన్సర్, కిడ్నీ, హెఐవీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు పూర్తి స్థాయి కవరేజీ అందించాల్సిందేనని ఐఆర్ డీఏఐ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీంతో అనేక మందికి ప్రయోజనం చేకూరనుంది.

అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేవారు ప్రీమియం డబ్బులను ఇన్ స్టాల్ మెంట్లలో చెల్లించే సదుపాయన్ని కూడా కల్పించాలని ఐఆర్ డీఏఐ స్పష్టం చేసింది. దీని ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేవారిపై ఆర్థికభారం తగ్గుతుంది. అలాగే ట్రావెల్ పాలసీలు కేవలం జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు అందించాలని పేర్కొంది.

ఆయుష్ ట్రీట్మెంట్ కవరేజీకి ఎలాంటి పరిమితి విధించవచ్చని కూడా ఐఆర్ డీఏఐ తెలిపింది. ఆయుర్వేద, యోగా, నేచురోపతి, ఉనాని, సిద్ధ, హోమియోపతి వంటి చికిత్సలు తీసుకునే వారికి ఎలాంటి పరిమితి విధించకుండా పూర్తి స్థాయిలో కవరేజీ అందించాలని స్పష్టం చేసింది.

సీనియర్ సిటిజన్ల ఫిర్యాదులు, క్లెయిమ్ లకు సంబంధించి ప్రత్యేక ఛానెల్ ను ఏర్పాటు చేయాలని ఐఆర్ డీఏఐ బీమా సంస్థలకు సూచించింది.

కాగా, జీవిత బీమా పాలసీదారులు తమకు ఇష్టమొచ్చిన ఆస్పత్రిలో చికిత్స తీసుకునేలా ఐర్ డీఐఏ ఇప్పటికే నిబంధనలు మార్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా పాలసీదారులు ఏ ఆస్పత్రిలోనైనా చేరి చికిత్స తీసుకోవచ్చు. బీమా సంస్థలు ఆయా ఆస్పత్రులతో క్లెయిమ్ సెటిల్ మెంట్ చేసుకోవాలి. లేదా పాలసీదారులు చెల్లించే బిల్లును వారికి తిరిగి చెల్లించాలి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.