You can download the new digital ration card for free.
Digital Ration Card Download ఫ్రీ గా కొత్త డిజిటల్ రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోగలరు.
Digital Ration Card Download :: ఫ్రెండ్స్ మీరందరూ డిజిటల్ ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్స్ ఇలా చూసి ఉంటారు.. ఐతే ఇప్పుడు రేషన్ కార్డు కూడా డిజిటల్ కార్డుగా డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.. డిజిటల్ కార్డు యొక్క ఉపయోగాలు ఏంటి.. పూర్తి వివరాలు ఈ పేజీలో నేను మీకు అందిస్తాను.. మీకు ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
డిజిటల్ రేషన్ కార్డ్ అనేది మీ పాత రేషన్ కార్డు యొక్క డిజిటల్ వెర్షన్, ఇది ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది మరియు ఒక ప్రత్యేక QR కోడ్ లేదా యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కలిగి ఉంటుంది. ఇది మాన్యువల్ కార్డుతో పోలిస్తే మరింత సులభతరం, భద్రతగా ఉంటుంది.
డిజిటల్ రేషన్ కార్డ్ లక్షణాలు
ఆన్‌లైన్ యాక్సెస్: ఎక్కడైనా, ఎప్పుడైనా మీ రేషన్ కార్డు వివరాలను చూస్తూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
QR కోడ్: ఇది డేటా ప్రామాణికతను నిర్ధారించేందుకు ఉపయోగపడుతుంది.
సురక్షితమైన డేటా: ఫిజికల్ కార్డు పోయినప్పటికీ, మీ డేటా భద్రంగా ఉంటుంది.
సర్కార్ సేవలకు అనుసంధానం: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) ద్వారా సబ్సిడీ రేషన్ సరుకులను పొందడానికి ఉపయోగపడుతుంది.
డిజిటల్ రేషన్ కార్డు ప్రయోజనాలు
ఆన్‌లైన్ సేవలు: రేషన్ కార్డు అప్డేట్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం వంటి పనులు ఆన్‌లైన్ ద్వారా సులభంగా చేయవచ్చు.
సమయం ఆదా: ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా డిజిటల్ ఫార్మాట్ ఉపయోగించవచ్చు.
పారదర్శకత: ప్రభుత్వ పథకాల న్యాయబద్ధమైన అమలుకు డిజిటల్ కార్డు ఉపయోగపడుతుంది
How to Download Digital Ration కార్డు
మీరు మీ డిజిటల్ రేషన్ కార్డుని డౌన్లోడ్ చేయాలంటే క్రింది చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాలి
Step 1 :: ఈ పేజీలో లాస్ట్ లో ఇచ్చిన Mera Ration అనే యాప్ నీ ఫస్ట్ డౌన్లోడ్ చేయాలి.
Step 2 :: యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే… మీకు అక్కడ కొన్ని నోటిఫికేషన్స్ హలో ఇవ్వండి.. ఇచ్చిన వెంటనే లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.
Step 3 :: ఇక్కడ మీకు రెండు లాగిన్స్ కనిపిస్తాయి. Beneficiaries Users, Department User’s.. ఇందులో మీరు బెనిఫిషరీస్ యూజర్స్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయగానే మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది.
Step 4 :: ఇప్పుడు మీరు ఎవరు రేషన్ కార్డు డౌన్లోడ్ చేయాలనుకుంటే.. వాళ్ల యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి.. మళ్లీ క్యాప్చర్ ఎంటర్ చేయగానే మీ ఆధార్ కార్డు లింక్ అయినా మొబైల్ కి ఒక ఓటిపి రావడం జరుగుతుంది.
Step 5 :: ఆ ఓటిపిని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీకు మళ్ళీ ఒక ఎంపిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది.. అక్కడ మీరు ఒక పిన్ సెట్ చేసుకోండి.. తర్వాత లాగిన్ పేజీ మీద క్లిక్ చేయగానే యాప్ ఓపెన్ అవడం జరుగుతుంది.
Step 6 :: అక్కడ హోం పేజీ మీద మీ రేషన్ కార్డు డిజిటల్ కార్డు కనిపిస్తుంది.. అక్కడ వీ రేషన్ కార్డుకు సంబంధించి సమగ్ర సమాచారం.. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు.. పూర్తి వివరాలు అక్కడి నుంచే తెలుసుకోవచ్చును.
Step 7 :: డిజిటల్ రేషన్ కార్డు పైన డౌన్లోడ్ సింబల్ ఉంటుంది.. సింపుల్గా మీరు ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ మొబైల్ లో కొత్త రేషన్ కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది.