Cibil Score Tips

Cibil score is low..?  Follow these tips and increase..

Cibil Score Tips : సిబిల్ స్కోరు తక్కువగా ఉందా..? ఈ టిప్స్ పాటించి పెంచుకోవచ్చు..

Cibil score is low..?  Follow these tips and increase..

తక్కువ వడ్డీ రేటుతో లోన్ పొందాలంటే మంచి సిబిల్ స్కోరు ఉండాలి. కానీ కొంతమందికి స్కోరు చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటించి దీనిని మెరుగుపరుచుకోవచ్చు.

ఈరోజుల్లో సిబిల్ స్కోరు చాలా కీలకం. లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మొదటగా కస్టమర్ సిబిల్ స్కోరునే చెక్ చేస్తాయి. కాబట్టి ఈ స్కోరు ఎంతు ఎక్కువగా ఉంటే అంత మంచిది. లోన్ త్వరగా వస్తుంది. వడ్డీ రేటు కూడా తక్కువగా పొందే అవకాశం ఉంటుంది. క్రెడిట్ స్కోరు లేదా సిబిల్ స్కోరు సాధారణంగా 600 నుంచి 900 వరకు ఉంటుంది. ఇది 700 కంటే ఎక్కువగా మెయింటెన్ చేస్తే రుణగ్రహీతకు ఆర్థిక క్రమశిక్షణ ఉందని అర్థం. అంటే క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐలు డ్యూ తేదీ లోగా చెల్లిస్తున్నట్లు స్పష్టత వస్తుంది. అయితే సిబిల్ స్కోరు తక్కువగా ఉన్నవారు కూడా పెంచుకునేందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

క్రెడిట్ లిమిట్

క్రెడిట్ లిమిట్ ను 100 శాతం ఉపయోగించుకోకుండా 30 శాతం వరకే పరిమితం చేయాలి. ఉదాహరణకు క్రెడిట్ కార్డు లిమిట్ రూ. లక్ష ఉంటే, ప్రతి నెల రూ. 30 వేల లోపే ఖర్చు చేస్తే సిబిల్ స్కోరు మెరుగుపడే అవకాశం ఉంటుంది. లిమిట్ ఉంది కదా అని మొత్తం వాడుకుంటే ఆర్థిక ఒత్తిడి ఉన్నట్లు భావించాల్సి వస్తుంది. అప్పుడు క్రెడిట్ స్కోరుపై నెగిటివ్ ప్రభావం పడుతుంది. కాబ్టటి క్రెడిట్ కార్డు ఖర్చులు వీలైనంత తగ్గించుకుంటే మంచిది.

బిల్లులు, ఈఎంలు డ్యూ తేదీలోగా చెల్లించాలి

క్రెడిట్ కార్డులు బిల్లులు, పర్సనల్ లోన్, హోమ్ లోన్ ఈఎంఐలు ప్రతి నెలా డ్యూ తేదీలోగా చెల్లించాలి. ఒక్క ఈఎంఐ చెల్లించడం మిస్ అయినా కూడా సిబిల్ స్కోరుపై ప్రభావం పడుతుంది. మీకు లోన్ తిరిగి చెల్లించే స్తోమత లేదనే అర్థం వస్తుంది. కాబట్టి ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకుండా చూసుకోవాలి.

లోన్లు

రుణగ్రహతీలు అన్ సెక్యూర్డ్ లోన్లు, సెక్యూర్డ్ లోన్లు కలిగి ఉంటే క్రెడిట్ స్కోరుపై పాజిటివ్ ప్రభావం పడుతుంది. కేవలం అన్ సెక్యూర్డ్ లోన్లు మాత్రమే ఉంటే నెగిటివ్ ప్రభావం ఉంటుంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా తీసుకునే లోన్లను అన్ సెక్యూర్డ్ అంటారు. పర్సనల్ లోన్లు వీటి కిందకే వస్తాయి. ఇక ప్రాపర్టీ, వహానాలు తనఖా పెట్టి తీసుకునే లోన్లు సెక్యూర్డ్ లోన్లు అంటారు. ఉదాహరణకు హోమ్ లోన్లు, కార్ లోన్లు.

ఎక్కువ లోన్లకు అప్లై చేయవద్దు

చాలా మంది ఒక లోన్ ఉన్నప్పటికీ మరొక లోన్ కోసం దరఖాస్తు చేస్తుంటారు. ఒకవేళ లోన్ రాకపోతే మళ్లీ మళ్లీ దరఖాస్తు చేస్తుంటారు. ఇలా చేస్తే సిబిల్ స్కోరు తగ్గుతుంది. తరచూ క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసినా క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది.

క్రెడిట్ రిపోర్ట్

తరచూ సిబిల్ స్కోరును చెక్ చేసుకుంటే మంచిది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నుంచి వీటిని పొందవచ్చు. రిపోర్టు చూసినప్పుడు స్కోరు తక్కువగా ఉంటే మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించవచ్చు. లేదా మీ పేరుపై మోసపూరిత లావాదేవీలు జరిగినా తెలుసుకోవచ్చు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.