Have you been using the same number for 5 years?
మీరు 5 సంవత్సరాలుగా ఒకే నంబర్ వాడుతున్నారా? అయితే కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే!.
ఇది డిజిటల్ యుగం. ఈ యుగంలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. 2G నుంచి 5G వరకు అప్గ్రేడ్ అవుతున్నారు
బోర్ కొట్టినా, ఒంటరిగా అనిపించినా వెంటనే ఫోన్ తీసి ఉపయోగిస్తారు.
ప్రస్తుతం మొబైల్ వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇండియా ప్రధాన పాత్రధారిగా మారింది. అదేవిధంగా ఇండియాలో ఇంటర్నెట్ చౌక ధరలకు లభిస్తుంది. అలాగే ఇంటర్నెట్ అందించే కంపెనీలు కూడా పెరగడంతో, ప్రజలందరూ ఒకటికి రెండు సిమ్ కార్డులు వాడుతున్నారు. ఇందులో భాగంగానే ఒక్కొక్కరు 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఒకే సిమ్ కార్డును వినియోగిస్తుంటారు. అయితే ఒకే నంబరును 5 సంవత్సరాలకు పైగా వినియోగిస్తున్నట్లైతే మీలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీరు రుణగ్రహీత కాదు
మీరు 5 సంవత్సరాలుగా ఒకే నంబర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, మీరు డిఫాల్టర్ కాదని అర్ధం. మీరు రుణం తీసుకున్నప్పటికీ, మీరు దానిని సకాలంలో తిరిగి చెల్లిస్తారు. అంటే ఈ 5 సంవత్సరాలలో, మీరు ఎవరినీ మోసం చేయనట్లు అర్ధం అని నిపుణులు చెబుతున్నారు.
సంబంధాలకు విలువ ఇచ్చే వ్యక్తి
మీరు ఒకవేళ 5 సంవత్సరాలకు పైగా ఒకే నంబరును వినియోగిస్తున్నట్లైతే మీరు సంబంధాలను నమ్మే వ్యక్తి అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి సంబంధాన్ని నాశనం చేయకూడదనుకుంటారని అర్ధం. సంబంధాలను మీరు ఎంతో గౌరవిస్తారని, ఆ సంబంధాలకు అనుగుణంగా వ్యవహరిస్తారని అర్ధం.
మీరు నిజాయితీపరులు
మీరు చాలా సంవత్సరాలుగా ఒకే మొబైల్ నంబర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, మీరు చాలా నిజాయితీపరులు అని చెప్పొచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నిజాయితీని రాజీ పడరు. మోసం చేయాలని ఎప్పుడూ అనుకోరు. అందువలన, మీ సంబంధం మరింత బలంగా మారుతుంది.
మీపై ఎటువంటి ఆరోపణలు లేవు
మీరు చాలా సంవత్సరాలుగా ఒకే నంబరును వినియోగిస్తున్నట్లైతే మీపై ఎటువంటి ఫిర్యాదులు లేవని అర్ధం చేసుకోవచ్చు. దీని అర్థం మీపై స్నేహితుల నుండైనా, కుటుంబ సభ్యులు నుండైనా లేదా పోలీసుల నుండి ఎటువంటి కేసులు, ఫిర్యాదులు లేదా ఆరోపణలు లేవని అర్థం. ఒక విధంగా చెప్పాలంటే మీరు పవిత్రులు.