137 Jobs in Bharat Electronics Govt.
BEL : ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్‌లో 137 ఉద్యోగాలు.. రూ.55,000 వరకు జీతం
BEL Recruitment 2025 : భారత ప్రభుత్వ రంగ సంస్థ నవరత్న కంపెనీ బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన 137 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లింక్ ఇదే. మరో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు సంఖ్య: 137
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు - 67
ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - 70
ఇతర ముఖ్యమైన సమాచారం :
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ట్రైనీ ఇంజినీర్ పోస్టుకు 28 ఏళ్లు.. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకలు 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు మొదటి ఏడాది రూ.30,000.. రెండో ఏడాది రూ.35,000.. మూడో ఏడాది రూ.40,000.. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు మొదటి ఏడాది రూ.40,000.. రెండో ఏడాది రూ.45,000.. మూడో ఏడాది రూ.50,000.. నాలుగో ఏడాది రూ.55,000 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రాతపరీక్ష, షార్ట్‌లిస్టింగ్ ద్వారా ఎంపిక చేస్తారు, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రూ.150+ జీఎస్‌టీ.. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు రూ.400+ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
చిరునామా: డిప్యూటీ జనరల్ మేనేజర్, ప్రొడక్ట్ డెవెలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ప్రొఫెసర్ యూఆర్ రావు రోడ్, నాగాలాండ్ సర్కిల్, జళహల్లి పోస్టు, బెంగళూరు చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2025.
Important Links:
>>Apply Here --> Click Here
>>Notification --> Click Here
>>Official Website --> Click Here