Auction for Sarpanch post, record price

Auction for Sarpanch post, record price

తెలంగాణ పల్లెల్లో ఎన్నికల హడావుడి.. సర్పంచ్ పదవికి వేలం పాట, రికార్డు ధర.

Auction for Sarpanch post, record price

స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే కొన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. గద్వాల జిల్లా గోకులపాడులో సర్పంచ్ పదవికి వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.27.63 లక్షలకు వేలంపాట పాడారు. ఈ డబ్బును శివాలయం నిర్మాణానికి ఖర్చు చేయాలని గ్రామస్థులు తీర్మానం చేశారు.

తెలంగాణ పల్లెల్లో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల హడావుడి మెుదలైంది. ఏ నలుగురు ఓ చోట గూమిగూడినా.. ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. కొందరు ఆశావాహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా మెుదలుపెట్టారు. గ్రామాల్లో మంచి, చెడులకు హాజరవుతూ.. ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇంకొందరైతే ప్రత్యేకంగా గ్రామాలకు మేనిఫెస్టో సైతం రిలీజ్ చేస్తున్నారు. తమను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని వాగ్దానాలు ఇస్తున్నారు. తాజాగా.. ఓ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం వేలం పాట నిర్వహించారు. పోటా పోటీగా జరిగిన ఈ వేలంపాటలో ఓ వ్యక్తి రికార్డు ధరకు పాట పాడారు.

వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే సర్పంచ్ పదవి కోసం వేలంపాట నిర్వహించారు. సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు గ్రామస్థులు వేలంపాట ఏర్పాటు చేశారు. గోకులపాడు గ్రామంలో మెుత్తం జనాభా 1000 మంది కాగా.. 480 ఓట్లు ఉన్నాయి. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు డబ్బులు ఖర్చుపెట్టి ఎన్నికలు నిర్వహించకుండా గ్రామ సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు గ్రామస్థులు తీర్మానించారు.

అందుకు వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో నలుగురు వ్యక్తులు పాల్గొనగా.. పోటాపోటీగా వేలం జరిగింది. చివరకు భీమరాజు అనే వ్యక్తి రికార్డు స్థాయిలో రూ.27.63 లక్షలకు దక్కించుకున్నాడు. ఈ వేలం పాట గ్రామంలో నిర్మిస్తున్న నూతన గుడి కోసం నిర్వహించామని గ్రామస్థులు చెబుతున్నారు. వేలం జరిగిన విషయాన్ని బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు.

కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కార్ సిద్ధమవుతోంది. ఈనెలాఖరు లోగా నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తోంది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు ఈసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. ఈనెల 15 లోగా శిక్షణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. శిక్షణ పూర్తి కాగానే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.