Lakhpati Didi Scheme : Good news for women, interest free loan up to Rs.5 lakh
Lakhpati Didi Scheme : మహిళలకు గుడ్‌న్యూస్, రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం-కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం.
Lakhpati Didi Scheme : దేశంలోని మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం మహిళలకు వ్యాపారం కోసం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తుంది. మహిళలు సొంతంగా వ్యాపారం చేసేందుకు ఆర్థిక చేయూతను అందిస్తోంది. "లఖ్‌పతి దీదీ యోజన స్కీం"తో మహిళకు అండగా ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని అనే పథకాలను అమలు చేస్తోంది. మహిళల సాధికారత కోసం కూడా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో పాటు మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు వివిధ రకాల పథకాలను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే మహిళలను ఆర్థికంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం "లఖ్‌పతి దీదీ యోజన స్కీం" అమలు చేస్తోంది.
మహిళలు వ్యాపారాన్ని ఎలా సెటప్ చేస్తారు?
ఈ పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తుంది. అయితే ఈ పథకాన్ని మహిళలు ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు. ఎలా వారి వ్యాపారాన్ని సెటప్ చేసుకోవాలనే విషయాలు తెలుసుకుంటాం. ఈ పథకం లక్ష్యం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, వ్యాపారాలను స్థాపించడంలో వారికి సహాయం చేయడం. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు మహిళలు స్వయం సహాయక గ్రూపులలో చేరి ఉండాలి. ఇవి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళల కోసం రూపొందించబడ్డాయి. ఈ బృందంలోని ఒక మహిళ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఆమె తన వ్యాపార ప్రణాళికతో స్వయం సహాయ బృందం ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఇలా చేసుకోవాలి:
మీరు కూడా లఖ్‌పతి దీదీ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థి అయితే, మీరు కూడా ఈ పథకంలో దరఖాస్తు చేయాలనుకుంటే, మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://www.india.gov.in/spotlight/lakhpati-didi ను క్లిక్ చేసి, వెబ్‌సైట్ హోం పేజీలోకి వెళ్లాలి. వివరణలో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్‌లో అవసరమైన మొత్తం సమాచారాన్ని పూరించాలి. మీరు మీ అన్ని పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. అప్పుడు సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం రసీదు లభిస్తుంది. ఆ రసీదును ప్రింట్ తీసుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా లఖ్‌పతి దీదీ యోజన కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆయా బృందంలోని మహిళా సభ్యుల వ్యాపార ప్రణాళికను స్వయం సహాయ సంఘాల ద్వారా ప్రభుత్వానికి పంపించాలి. ప్రభుత్వ అధికారులు వారి దరఖాస్తును పరిశీలిస్తారు. ఆ తరువాత దరఖాస్తు ఆమోదం పొందితే రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం లభిస్తుంది. దీంతో పాటు మీరు లోన్ పొందిన తరువాత అవసరమైన శిక్షణను కూడా ప్రభుత్వం అందిస్తుంది. ఆయా కంపెనీ కోసం అవసరమైన నైపుణ్యలను మెరుగుపర్చుకునే అవకాశం కల్పిస్తుంది.
అప్పటికే లోన్ తీసుకుంటే, కొత్తగా రావడానికి ఛాన్స్ తక్కువ:
లఖ్‌పతి దీదీ యోజన స్కీం ఆధ్వర్యంలో మహిళలకు ప్రయోజనాలను అందించడానికి స్వయం సహాయ బృందంలో చేరి ఉండాలి. ఒక వేళ వారి బృందంలోని సభ్యులు ఇది వరకే లోన్ తీసుకుని ఉంటే మాత్రం మళ్లీ కొత్తగా లోన్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. పాత లోన్ గడువులోగా తీర్చడం, లేదా వాయిదాలు క్రమంగా కట్టడం ద్వారా వారికి మరిన్ని లోన్ సౌకర్యాలు లభిస్తాయి.
దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు:
1. లఖ్‌పతి దీదీ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, భారత పౌరులై ఉండాలి.
2. 18-50 సంవత్సరాల వయస్సు గల మహిళు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
3. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
4. మహిళల వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదు.
5. మహిళల కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూదు.
లఖ్‌పతి దీదీ యోజనకు అవసరమైన పత్రాలు:
1. ఆధార్ కార్డు.
2. మొబైల్ నంబర్.
3. పాస్‌పోర్టు సైజు ఫోటో.
4. పాన్‌కార్డ్.
5. ఆదాయ ధ్రవీకరణ పత్రం.
6. చిరునామా.
7. విద్యా అర్హత సర్టిఫికేట్.
8. బ్యాంకు ఖాతా వివరాలు.