Bag Cleaning Tips: Clean dirty school bags and office bags in minutes

 Bag Cleaning Tips: Clean dirty school bags and office bags in minutes.

Bag Cleaning Tips: మురికిగా ఉన్న స్కూల్ బ్యాగ్, ఆఫీస్ బ్యాగులు ఇలా నిమిషాల్లో శుభ్రపరిచేయండి, ఉతకాల్సిన అవసరం లేదు.

Bag Cleaning Tips: Clean dirty school bags and office bags in minutes. Bag Cleaning Tips: మురికిగా ఉన్న స్కూల్ బ్యాగ్, ఆఫీస్ బ్యాగులు ఇలా నిమిషాల్లో శుభ్రపరిచేయండి, ఉతకాల్సిన అవసరం లేదు.

Bag Cleaning Tips: మీ పిల్లల స్కూల్ బ్యాగ్ అయినా, మీ ఆఫీస్ బ్యాగ్ అయినా, త్వరగా మురికిగా మారతాయి. వాటిని ప్రతిసారీ ఉతకడం కష్టం. మీరు మీ బ్యాగ్ ఉతకాల్సిన అవసరం లేకుండా చిన్న చిట్కాల ద్వారా శుభ్రపరచుకోవచ్చు.

క్లీనింగ్ టిప్స్:

పిల్లల స్కూల్ బ్యాగ్ అయినా, ఆఫీసు బ్యాగ్ అయినా త్వరగా మురికి పట్టేస్తుంది. ప్రతిరోజూ దుమ్ము, ధూళి తాకడం వల్ల అవి డర్టీగా మారిపోతాయి. వాటిని ప్రతి వారం ఉతకడం కష్టం. అవేమీ దుస్తులు కావు ప్రతి వారం ఉతకడానికి. కొన్ని బ్యాగులను నీటిలో నానబెట్టడం అవి చెడిపోతాయనే భయం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో, మురికిగా కనిపించే బ్యాగును ఉతకకుండానే ఎలా శుభ్రం చేయాలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీ బ్యాగ్ ను ఉతకకుండానే ఎలా శుభ్రం చేయాలో ఇక్కడ మేము చెప్పాము. ఈ క్లీనింగ్ హ్యాక్ ల గురించి తెలిస్తే బ్యాగులు శుభ్రపరచడం చాలా సులువుగా మారిపోతుంది.

డిటర్జెంట్‌తో:

మీ బ్యాగ్ పై మొండి మరక ఉంటే, అది మీ బ్యాగును చెత్తగా కనిపించేలా చేస్తుంది. మీరు దానిని తొలగించడానికి చాలా సులభమైన ట్రిక్ ను అనుసరించవచ్చు. దీని కోసం, ఒక గిన్నెలో కొద్దిగా డిటర్జెంట్ లేదా సబ్బు ద్రావణాన్ని తయారు చేయండి. ఇప్పుడు ఈ సబ్బు ద్రావణంలో స్పాంజిని ముంచి బాగా పిండండి. ఇప్పుడు ఆ స్పాంజితో బ్యాగ్ పై ఉన్న మొండి మరకలను బాగా రుద్ది తొలగించండి. ఈ ట్రిక్ తో మీ బ్యాగ్ పై ఉన్న మొండి మరకలు చాలా సులువుగా పోతాయి. మీరు బ్యాగును ఉతకాల్సిన అవసరం లేదు.

మురికి వాసన పోయేందుకు:

బ్యాగును తరచూ శుభ్రం చేయకపోతే మురికి వాసన వస్తుంది. ఆ వాసన భరించడం కష్టంగానే ఉంటుంది. ఈ మురికి వాసనను తొలగించడానికి మీరు బ్యాగును ఉతకాల్సిన అవసరం లేదు. ఉతక్కుండానే ఈ వాసనను తొలగించవచ్చు. దీని కోసం, తడి గుడ్డతో బ్యాగ్ ను తుడిచి, ఎర్రటి ఎండలో ఆరబెట్టండి. ఇది సంచి మురికి వాసనను చాలా వరకు తగ్గిస్తుంది. మిగిలిన వాసనను తొలగించడానికి మీరు బ్యాగ్ లోపలి భాగంలో సబ్బుతో తయారుచేసిన స్ప్రేను కూడా చల్లడం ద్వారా కూడా క్లీన్ చేయవచ్చు.

బ్రష్ తో:

మీ స్కూలు లేదా ఆఫీస్ బ్యాగ్ పై దుమ్ము, ధూళి పేరుకుపోతే, దాని వల్ల బ్యాగు చాలా మురికిగా కనిపిస్తుంది. అలాంటప్పుడు బ్యాగ్ కడగవలసిన అవసరం లేకుండానే లాండ్రీ సాఫ్ట్ బ్రష్ సహాయంతో దాన్ని శుభ్రం చేయవచ్చు. ఇందుకోసం బ్యాగును ఖాళీ చేసి బ్యాగు బయటి, లోపలి భాగాన్ని బ్రష్ తో శుభ్రం చేయాలి. ఈ విధంగా బ్యాగ్ పై ఉండే దుమ్ము, మరకలు సులువుగా తొలగిపోతాయి. బ్రష్ తో రుద్ది తడి గుడ్డతో తుడిచేస్తే చాలు. బ్యాగు కొత్తదిలా మెరిసిపోతుంది.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.