TG Govt Digital Health Card

TG Govt Digital Health Card 

TG Govt Digital Health Card

ప్రతి ఒక్కరికి 'డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు' - మీ వివరాలను ఎలా సేకరిస్తారంటే..

TG Digital Health Profile Card : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డుల ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. 83 లక్షలకు పైగా కుటుంబాల ఆరోగ్య వివరాలను సేకరించనుంది. ఈ సమాచారాన్ని ప్రత్యేక యాప్ లో ఎంట్రీ చేయనున్నారు. త్వరలోనే డిజిటల్ హెల్త్ ఫ్రొఫైల్ కార్డులను జారీ చేయాలని సర్కరార్ భావిస్తోంది.

తెలంగాణలోని ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డును ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ స్కీమ్ ను త్వరలోనే పట్టాలెక్కించనుంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వైద్య సిబ్బంది వివరాలను సేకరించనుంది.

ఓ వ్యక్తికి సంబంధించిన పూర్తి ఆరోగ్య సమాచారం తెలుసుకునేలా ఈ కార్డులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో సమాచార సేకరణ నుంచి కార్డుల జారీ వరకు అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది.

ఇటీవలే డిజిటల్ హెల్త్ కార్డులపై మంత్రి దామోదర సమీక్ష నిర్వహించారు. ఇందులో కీలక ఆదేశాలను ఇచ్చారు.  'Health Profile of Individuals in the Family కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు.  ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో , రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజయవంతం చేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలోని 2011 జనాభా లెక్కల ప్రకారం 83.04 లక్షల కుటుంబాలలోని వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను నమోదు చేస్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రతి గడపకు తిరిగి వారి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటల్ రూపంలో యాప్ లో నమోదు చేయాలని మంత్రి అధికారాలను ఆదేశించారు.  

 Health profile of individuals in the family కార్యక్రమంలో భాగంగా పర్సనల్  డిటైల్స్, హెల్త్ హిస్టరీ రికార్డులను ప్రత్యేక యాప్ లో నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఆశ ఏఎన్ఎంలు ప్రతి గడపకు వెళ్లి వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించాలని సూచించారు. 

వ్యక్తుల సమాచారాన్ని వారి అనుమతితోనే రెండు దశల్లో సేకరించే అవకాశం ఉంది. డిజిటల్ హెల్త్ కార్డులో భాగంగా… ప్రతి వ్యక్తికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. బార్‌ కోడ్‌ కూడా ఉంటుంది. . సర్వే వివరాల నమోదుతో పాటు డిజిటల్ హెల్త్ కార్డుల జారీకి రాష్ట్ర ఐటీ శాఖ నుంచి సహకారం తీసుకోనున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులివ్వడానికి సుమారు రూ.180 కోట్లు అవసరమని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబరు నెలలోనే హెల్త్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.