Do you know which food contains animal fat? Beware of This..!
జంతువుల కొవ్వు ఏయే ఆహారంలో ఉంటుందో తెలుసా..? తస్మాత్ జాగ్రత్త..!
తిరుపతి దేవస్థానం లడ్డూలలో జంతువుల కొవ్వును ఉపయోగించారనే వార్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, ప్రస్తుత కాలంలో అందరూ బిజీ లైఫ్ గడుపుతున్నారు. మనం ఏం తింటున్నామో కూడా తెలుసుకోనంతగా మారిపోయింది జీవనశైలి. ఈ క్రమంలోనే మీరు తినే దాంట్లో ఏముందో ఆలోచించే సమయం కూడా లేకుండా పోయింది. దాంతో మనం చే చాలాసార్లు మనకు తెలియకుండానే తినకూడాని పదార్థాలను కూడా తినేస్తాం. జంతువుల కొవ్వు విషయం కూడా ఇలాంటిదే.
శాకాహారులు మాంసం, జంతువుల కొవ్వుకు దూరంగా ఉంటారు. కానీ, కొన్నిసార్లు తెలియకుండానే వారు జంతువుల కొవ్వును ఉపయోగించిన వాటిని తింటారు. జంతువుల కొవ్వు విషయంలో పందికొవ్వును ఎక్కువగా వినియోగిస్తుంటారనే వార్తలు ఎక్కువగా వస్తుంటాయి. ఇది వివిధ ఆహారాలు, ఉత్పత్తులలో ఎక్కువగా కలుపుతుంటారని అంటున్నారు. జంతువుల కొవ్వును కలిగి ఉండే కొన్ని సాధారణ ఉత్పత్తుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి..
ఇలాంటి వస్తువులలో జంతువుల కొవ్వును ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది..
వనస్పతి:
కొన్ని రకాల వనస్పతిలో జంతువుల కొవ్వు ఉండే అవకాశం ఉంది.
బిస్కెట్లు, కుకీలు:
చాలా బిస్కెట్లు, కుకీలలో జంతువుల కొవ్వు ఉంటుంది. మీరు వెన్న రుచిగల బిస్కెట్లు, కుకీలను తీసుకుంటే మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
సాసేజ్‌లు:
సాసేజ్‌లు, కొన్ని రకాల బార్‌లు, మీట్‌బాల్‌లు వంటి మాంసం ఆధారిత ఉత్పత్తుల్లో తరచుగా జంతువుల కొవ్వును ఉపయోగిస్తారు.
ఫాస్ట్ ఫుడ్:
ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్ వంటి అనేక ఫాస్ట్ ఫుడ్స్ తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగిస్తారు.
సూప్‌లు, స్టాక్‌లు:
రుచిని మెరుగుపరచడానికి జంతువుల కొవ్వును కొన్ని సూప్‌లు, స్టాక్‌లలో ఎక్కువగా వినియోగిస్తుంటారు.
చీజ్, పాల ఉత్పత్తులు:
కొన్ని రకాల జున్ను, ముఖ్యంగా ప్రాసెస్ చేయబడిన చీజ్ లలో జంతువుల కొవ్వును కలుపుతుంటారని సమాచారం.
చాక్లెట్:
కొన్ని చాక్లెట్లు మంచి ఆకృతి, రుచి కోసం జంతువుల కొవ్వును కలుపుతుంటారట.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమేనని గుర్తుంచుకోండి. కేవలం అవగాహన కోసం మాత్రమే..)

