Labour Insurance Card
మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..? లేబర్ ఇన్సూరెన్స్ కార్డు తీసుకోవచ్చు
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ లేబర్ ఇన్సూరెన్స్ కార్డును పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ అవకాశం లేదు. ఏడాదికి రూ.22 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఐదు సంవత్సరాలకు కలిపి ఒకేసారి ఈ డబ్బులను చెల్లించాలి. మొత్తం రూ. 110 అవుతుంది.
ముఖ్య వివరాలు:
లేబర్ ఇన్సూరెన్స్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు 18 నుంచి 55 ఏళ్ల వయసు ఉన్న స్త్రీ. పురుషులు అర్హులు.
ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన, ఇతరులైన ఇందులో చేరవచ్చు.
రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జిరాక్స్ జత చేయాలి.
బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.
ప్రయోజనాలు:
పాలసీదారు సహజ మరణం పొందితే రూ. 1,30,000 అందుతాయి. అలాగే ప్రమాదవశాత్తూ మరణం జరిగే రూ. 6,00000 ఇన్సూరెన్స్ అందుతుంది.
ఒక ఇంట్లో ఇద్దరు అడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000 అందుకుంటారు.
ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు రూ. 30,000 చొప్పున వచ్చే అవకాశం ఉంది.
ఒక సంవత్సరం పాలసీ పొందిన తరువాత లబ్దిదారునికి ప్రమాదం జరిగి 50 శాతం దివ్యాంగుడిగా ఉంటే 2.50 లక్షలు అందుతాయి. అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.
ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకేసారి 110/- రూ. చెల్లిస్తే 5 సంవత్సరాలు వరకు చెల్లించనక్కర్లేదు. అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/- రూ మాత్రమే.
ఈ కార్డు తీసుకోవాలనుకునే వారు మీ మండలంలోని కార్మిక అధికారిని (లేబర్ ఆఫీసర్) లేదా ఎంపీడీఓ,,తహసీల్దార్ ను సంప్రదించవచ్చు.
ఈ పథకంలో చాలా మంది కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు. అది కానే కాదు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులు అవుతారు.