ITBP Constable Recruitment 2024.
Constable Jobs : 10వ తరగతి అర్హతతో.. 819 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.
ITBP Constable Recruitment 2024 : కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP).. నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) గ్రూప్-సీ విభాగంలో కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 819 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పురుషులకు 697, మహిళలకు 122 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 1వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://itbpolice.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ఇతర ముఖ్యమైన సమాచారం :
కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్): 819 పోస్టులు (యూఆర్- 458, ఎస్సీ- 48, ఎస్టీ- 70, ఓబీసీ- 162, ఈడబ్ల్యూఎస్- 81) ఉన్నాయి. ఇందులో.. పురుషులకు 697, మహిళలకు 122 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: మెట్రిక్యులేషన్/ 10వ తరగతితో పాటు ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషులకు ఎత్తు 165 సెం.మీ., మహిళల ఎత్తు 155 సెం.మీ. పురుషుల ఛాతీ 75 సెం.మీ. నుంచి 80 సెం.మీ. మధ్య ఉండాలి.
వయోపరిమితి (01-10-2024 నాటికి): 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.21,700 - రూ.69,100 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 2, 2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 1, 2024
దరఖాస్తు విధానం:
మొదట http://recruitment.itbpolice.nic.in/ ఐటీబీపీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఐటీబీపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 (కిచెన్ సర్వీసెస్) అప్లికేషన్ లింక్‌ను ఓపెన్ చేయాలి
ముందుగా రిజిస్టర్ చేసుకుని మీ లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి
ఇప్పుడు దరఖాస్తు ఫారాన్ని నింపడానికి కంటిన్యూ చేయాలి.
అక్కడ సూచించిన సమాచారాన్ని నమోదు చేసి, డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
మీ ఫారమ్ సబ్మిట్ చేసి.. ధృవీకరణ పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.