Aadhaar Loan: Good chance.. Rs.5 lakh loan with Aadhaar card.. How to apply?
Aadhaar Loan: మంచి ఛాన్స్.. ఆధార్ కార్డుతోనే రూ.5 లక్షల లోన్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Aadhaar Loan: ప్రస్తుతం చాలా మంది బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారు. తమ అవసరాన్ని బట్టి అవసరమైన మేరకు వివిధ రకాలు లోన్లు తీసుకునేందుకు అవకాశం ఉంది. అయితే, ఎక్కువగా ఆదరణ పొందుతోంది మాత్రం వ్యక్తిగత రుణాలే. ఎలాంటి గ్యారెంటీలు లేకుండానే ఈ లోన్స్ ఇస్తుంటాయి బ్యాంకులు. అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు వీటినే ఎంచుకుంటారు. పెళ్లిళ్లు, ఇంటి ఆధునికీకరణ, చదవుల వంటి వాటి కోసం ఉపయోగించుకుంటారు. వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేస్తే బ్యాంకులు కేవైసీ అంటూ ఐడీ ఫ్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఆదాయ ధ్రువీకరణ అంటూ వివిధ పత్రాలు అడుగుతాయి. అయితే, ప్రస్తుతం చాలా బ్యాంకులు ఆధార్ ఐడీ ప్రూఫ్‌తోనే రుణాలు మంజూరు చేస్తున్నాయి. వ్యక్తిగత గుర్తింపు డాక్యుమెంటుగా దీన్నే పరిగణిస్తున్నాయి.
ఆధార్ కార్డు గుర్తింపుతో చాలా బ్యాంకులు ప్రస్తుతం ఇన్‌స్టాంట్‌గా వ్యక్తిగత రుణం మంజూరు చేస్తున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు ఆధార్ కార్డుతోనే ఇన్‌స్టాంట్‌గా పర్సనల్ లోన్ ఇస్తోంది. పూర్తిగా డిజిటల్ విధానంలోనే ప్రక్రియ ఉంటుంది. క్విక్ వెరిఫికేషన్ కోసం ఆధార్ వివరాలు అందించి బ్యాంకు అడిగే ఆర్థిక వివరాలు అందిస్తే లోన్ మంజూరవుతుంది. కొన్ని గంటల్లోనే డబ్బులు మీ బ్యాంకు అకౌంట్లలో జమ అవుతాయి. మరి ఆధార్‌తో ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్ ఎలా పొందాలి? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఎంత వరకు లోన్ అందుకోవచ్చు? అనే విషయాలు తెలుసుకుందాం.
ఆధార్‌తో ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్ కింద రూ.30 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం పొందవచ్చు. లోన్ రీపేమెంట్ టెన్యూర్ అనేది మీ సౌలభ్యం ప్రకారం ఏడాది నుంచి 4 ఏళ్ల వరకు ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ ఎలాంటి హిడెన్ ఛార్జీలు ఉండవు. అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. లోన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీరు ఎంపిక చేసుకున్న బ్యాంకు వెబ్‌సైట్లో పర్సనల్ లోన్ సెక్షన్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. లేదా సదరు బ్యాంకు యాప్ డౌన్లోడ్ చేసుకుని లోన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
లోన్ సెక్షన్‌లోకి వెళ్లాక పాన్ నంబర్, ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్ అందించాలి. ఆ తర్వాత ఫోన్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. అప్లికేషన్ ఫారం వస్తుంది. అందులో మీ పర్సనల్, ప్రొఫెషనల్, ఫైనాన్షియల్ వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత నిబంధనలు, షరతులను యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ అర్హతలను బట్టి మీకు ఎంత లోన్ వస్తుందనేది కనిపిస్తుంది. మీకు నచ్చిన ఆఫర్‌పై క్లిక్ చేయాలి. మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం, ఇతర విషయాల ఆధారంగా మీకు లోన్, వడ్డీ రేటును బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. పాన్‌తో పాటు ఆదాయ సంబంధించిన పత్రాలు బ్యాంకులు అడిగే అవకాశం ఉంటుంది. అవసరమైతే బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకులు అడిగిన వివరాలు అందించిన తర్వాత మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.