State Bank loan

In State Bank  Want a Rs. 30 lakh home loan?

స్టేట్ బ్యాంక్ లో రూ. 30 లక్షల హోమ్ లోన్ కావాలా..?

In State Bank  Want a Rs. 30 lakh home loan? స్టేట్ బ్యాంక్ లో రూ. 30 లక్షల హోమ్ లోన్ కావాలా..?

ఈ రోజుల్లో ఓ ఇంటికి యజమాని అనిపించుకోవాలంటే చాలా కష్టపడాలి. ప్రస్తుతం ఇల్లు కొనాలన్నా, నిర్మించాలన్నా భారీగా డబ్బు ఖర్చు చేయాలి. అందుకే చాలా మంది బ్యాంక్‌ నుంచి హోమ్‌ లోన్‌ సాయం తీసుకుంటున్నారు. అయితే హోమ్‌ లోన్‌ కోసం అప్లై చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. సాధారణంగా ఈ రుణం ఎక్కువ అమౌంట్‌, ఎక్కువ టెన్యూర్‌తో వస్తుంది. కాబట్టి దీర్ఘకాలం ఆర్థిక పరిస్థితులు, లక్ష్యాలపై ప్రభావం చూపుతుంది. అందుకే హోమ్‌ లోన్‌ ఎంత అవసరం? వడ్డీ ఎంత అవుతుంది? ప్రతి నెలా ఈక్వేటెడ్‌ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (EMI) ఎంత చెల్లించాలి? వంటి విషయాలు తెలుసుకోవాలి.

ముందుగా లోన్‌ వివరాలు తెలుసుకుంటే, ప్రతినెలా ఈఎంఐకి కేటాయించగలిగే మొత్తం ఆధారంగా లోన్‌ ఎంచుకోవచ్చు. అదనపు భారాన్ని, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మీకు హోమ్‌ లోన్‌ తీసుకునే ఆలోచన ఉంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వడ్డీ రేట్లను ఓసారి చెక్ చేయండి. ఎస్బీఐ గృహ రుణంపై ప్రారంభ వడ్డీ రేటు 9.15 శాతం వసూలు చేస్తోంది. మీరు 20 సంవత్సరాలకు రూ.30 లక్షల రుణం తీసుకోవాలనుకుంటే, నెలవారీ EMI ఎంత ఉంటుంది? లోన్ వ్యవధిలో ఎంత? వడ్డీ ఎంత అవుతుంది? వంటి వివరాలు తెలుసుకుందాం.

* స్టేట్‌బ్యాంక్‌ హోమ్ లోన్ ఈఎంఐ కాలిక్యులేషన్‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 750 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్‌కు మాత్రమే 9.15 శాతం ప్రారంభ రేటుతో గృహ రుణం లభిస్తుంది. ఇప్పుడు మీరు 20 సంవత్సరాలకు రూ.30 లక్షల లోన్ తీసుకోవాలి అనుకుందాం. జీ బిజినెస్ రిపోర్ట్ ప్రకారం.. 9.15 శాతం వడ్డీ రేటుతో మీ EMI ఎంత ఉంటుంది..? గృహ రుణంపై వడ్డీ రేటు టెన్యూర్‌ మొత్తం ఒకే విధంగా ఉంటే, ఎంత వడ్డీ అవుతుందో చూద్దాం.

మొత్తం లోన్‌ అమౌంట్‌ రూ.30 లక్షలు, లోన్‌ టెన్యూర్ 20 సంవత్సరాలు. బ్యాంకు వసూలు చేసే వడ్డీ సంవత్సరానికి 9.15%గా ఉంది. దీంతో ప్రతి నెలా ఈఎంఐ రూ. 27,282 అవుతుంది. ఇలా మొత్తం టెన్యూర్‌లో చెల్లించే వడ్డీ రూ.35,47,648. మొత్తం చెల్లించే అమౌంట్‌ రూ.65,47,648 అవుతుంది.

20 ఏళ్లలో మొత్తంగా చెల్లించే అమౌంట్‌ ఏకంగా రూ.65,47,648 అవుతుంది. అందులో సగానికిపైగా రూ.35,47,648 వడ్డీ రూపంలో చెల్లిస్తారు. అయితే, CIBIL స్కోర్, లోన్ రీపేమెంట్ కెపాసిటీ ఆధారంగా హోమ్ లోన్ వడ్డీ రేట్లను నెగోషియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేటు అందుకునే అవకాశం ఉంటుంది. అదే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటుతో లోన్‌ తీసుకుంటే ప్రస్తుత రేట్ల కంటే తగ్గే సూచనలు ఉంటాయి.

SBI వంటి షెడ్యూల్డ్ బ్యాంకుల నుంచి గృహ రుణాలు నేరుగా రిజర్వ్ బ్యాంక్ రెపో రేటుతో అనుసంధానమై ఉంటాయి. రెపో రేటు అనేది వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి రుణాలు తీసుకునే వడ్డీ రేటు. రెపో రేటు పెరిగితే ఆటోమేటిక్‌గా హోమ్‌ లోన్‌ ఇంట్రస్ట్ రేట్లు పెరుగుతాయి.2019 అక్టోబర్ నుంచి ఫ్లోటింగ్ రేట్లపై ఇచ్చిన వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, గృహ రుణాలు మొదలైనవాటిని బ్యాంకులు లింక్ చేయడాన్ని RBI తప్పనిసరి చేసింది. చాలా బ్యాంకులు రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR) వద్ద గృహ రుణాలు అందిస్తున్నాయి. దీనిని ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేట్ (EBR) అని కూడా అంటారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.