Why mobile white charger turns yellow color..? Have you ever noticed this...

Why mobile white charger turns yellow color..? Have you ever noticed this...

మొబైల్ వైట్ ఛార్జర్ ఎందుకు పసుపు కలర్లోకి మారుతుంది..? ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించారా...

Why mobile white charger turns yellow color..? Have you ever noticed this...

కొత్త మొబైల్‌తో వచ్చిన ఛార్జర్ చాలా రోజుల తర్వాత కలర్ మారడం జరుగుతుంటుంది. అప్పుడు తెల్లగా ఉన్న ఛార్జర్ రంగు ఇప్పుడు పసుపు రంగులోకి మారిందేంటి అని ఎప్పుడైనా అనుకున్నారా...  అసలు రంగు ఎందుకు మారుతుందో తెలుసా..?

చేతిలో మొబైల్ ఉన్నా ఛార్జర్  లేకపోతే  ఉపయోగం లేదు. మొబైల్ కి ఛార్జర్ ప్రాణం లాంటిది. మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్, బ్యాటరీ మొదలైన వాటిని ఛార్జ్ చేయడానికి ఛార్జర్ చాలా అవసరం. రోజుకు కనీసం రెండుసార్లైనా మొబైల్ ఛార్జింగ్ చేస్తుంటాం. కొందరు గంటలు గంటలు  ఛార్జ్  చేస్తుంటారు. ఛార్జింగ్ సంబందించిన డివైజ్ బ్యాటరీపై ఆధారపడి ఉంటుంది.  

కొన్ని ఛార్జర్లు బ్లాక్, మరికొన్ని వైట్ కలర్లో ఉంటాయి. తెలుపు రంగు ఛార్జర్లు కొంత కాలం తర్వాత పసుపు రంగులోకి మారుతుంటాయి. మనం నిత్యం వాడటం వల్ల వైట్ ఛార్జర్లు పసుపు రంగులోకి మారి ఉండవచ్చు లేదా వాటిపై దుమ్ము పేరుకుపోయి పసుపు రంగులోకి మారి ఉండవచ్చు. కానీ ఛార్జర్ పసుపు రంగులోకి మారడానికి చాలా కారణాలు ఉన్నాయి.

ఫోన్ ఛార్జర్ పాతది అయినప్పుడు మాత్రమే పసుపు రంగులోకి మారదు. ఛార్జర్ పసుపు రంగులోకి మారడం చాలా ప్రమాదకరమని రెడ్డిట్ యూజర్  తెలిపారు. ఛార్జర్ పసుపు రంగులోకి మారడంపై చాలా మంది కామెంట్ చేసారు. ఛార్జర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పుడు  పసుపు రంగులోకి మారుతుంది. దీంతో ఛార్జర్‌ ద్వారా మంటలు అంటుకునే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల, వీలైనంత త్వరగా పసుపు ఛార్జర్‌ను మార్చడం అవసరం.

ఛార్జర్‌ని ఎలా ఉపయోగించాలి : మనం ఛార్జర్‌లను ఎలా ఉపయోగిస్తాము అనేది కూడా వాటి లైఫ్ పై ఆధారపడి ఉంటుంది. ఛార్జర్‌ను అన్‌ప్లగ్ చేస్తున్నప్పుడు  కేబుల్‌ను పట్టుకోని తీసివేయవద్దు. ఛార్జర్‌కి ఉన్న కనెక్టర్‌ని పట్టుకోని  తీయాలి. ఛార్జర్ కేబుల్‌ను పట్టుకుని   తీయడం వల్ల ఛార్జర్ వేగంగా దెబ్బతింటుంది.

ఛార్జర్‌ను మడతపెట్టి ఉంచడం వల్ల దానిలోని రాగి తీగపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఒక reddit యూజర్ ఛార్జర్ చాలా ఒత్తిడి గురై  పేలోచ్చు  అని  చెప్పారు. ఆపిల్ కంపెనీ కేబుల్‌లో కూడా ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయని మరో యూజర్ చెప్పారు. కేబుల్‌లోని ఇన్సులేషన్ క్షించి  దాని నుండి వేడి విడుదలవుతుంది. ఎక్కువ వేడి కారణంగా కేబుల్ రంగు పసుపు రంగులోకి మారుతుందని చెబుతున్నారు.

 కొన్నిసార్లు వోల్టేజ్ సమస్యలు కేబుల్ రంగు మారడానికి, ఛార్జర్ వేడెక్కడానికి లేదా పేలడానికి కారణం కావచ్చు. ఇలా ఛార్జర్ రంగు మారడానికి చాలా మంది రకరకాల కారణాలు చెబుతున్నారు. కాబట్టి ఛార్జింగ్ కేబుల్ పసుపు రంగులోకి మారిన వెంటనే మీ ఛార్జర్‌ని మార్చడం మంచిది. లేదంటే మీ మొబైల్ ఛార్జర్ సమస్య వల్ల పాడైపోవచ్చు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.