This is what Android is going to do! Soon Xiaomi's new Hyper OS.. what will it be like..?

 This is what Android is going to do! Soon Xiaomi's new Hyper OS.. what will it be like..?

ఆండ్రాయిడ్ చేయబోయేది ఇదేనా ! త్వరలో షియోమీ కొత్త హైపర్ ఓఎస్.. ఎలా ఉండబోతుందంటే..?

This is what Android is going to do! Soon Xiaomi's new Hyper OS.. what will it be like..?

ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షియోమీ(Xiaomi) మొబైల్ ఫోన్‌లలో పదేళ్లకు పైగా ఉపయోగిస్తున్న MIUI ద్వారా HyperOS అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. Xiaomi దీనిని యూజర్-సెంట్రిక్ OS అని పేర్కొంది. ఈ ప్లాట్‌ఫారమ్ స్మార్ట్‌ఫోన్‌లు, స్టార్ట్ వాచ్, స్టార్ట్ టీవీ ఇంకా షియోమీ తయారు చేసే హోమ్ అప్లియన్సెస్ లో ఉపయోగించేందుకు అభివృద్ధి చేయబడింది.

Xiaomi గత 13 సంవత్సరాలలో గణనీయంగా ఎదిగింది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా 1.17 బిలియన్ల యూజర్లను ఆకర్షించింది. కంపెనీ దాని ఉత్పత్తులను 200 వివిధ క్యాటగిరిలోకి విస్తరించినట్లు పేర్కొంది. అయితే, 2017లో మాత్రమే కొత్త ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది.

హైపర్‌ఓఎస్ అన్ని డివైజెస్ లో ఉపయోగించగల ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఉండాలనే లక్ష్యంతో రూపొందించబడింది. Xiaomi 14 సిరీస్, Xiaomi వాచ్ S3, Xiaomi TV S Pro 85” మినీ LED హైపర్‌ఓఎస్‌తో ముందే ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. Xiaomi ఈ ప్లాట్‌ఫారమ్‌తో సరికొత్త ఇంటర్‌ఫేస్‌ను వాగ్దానం చేస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌ల కోసం హైపర్‌ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆండ్రాయిడ్ 14 లాంటి ఫీచర్లతో ఉంటుంది.

హైపర్‌ఓఎస్ భారీ వినియోగంలో కూడా మంచి పనితీరును అందిస్తుందని Xiaomi పేర్కొంది. దీని హైపర్‌కనెక్ట్ ఫీచర్‌తో, ఈ OS వినియోగదారులకు కనెక్ట్ చేయబడిన అన్ని డివైజెస్లను ఎక్కడి నుండైనా కంట్రోల్ చేయగల సామర్థ్యాన్ని అందిస్తుంది.

HyperOS ప్లాట్‌ఫారమ్‌లోని HyperMind AI అనే ఫీచర్ వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుంటుంది ఇంకా డివైజెస్ అనుగుణంగా పని చేస్తుంది. అడ్వాన్స్డ్ ఫీచర్‌లతో థర్డ్-పార్టీ అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేయడం, ఉపయోగించడం కూడా ఉంటుంది. Xiaomi TEE ఇంకా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో యూజర్ సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇస్తుంది.

Redmi K60 Ultra, Xiaomi iPad 6 Max 14-inch, Xiaomi TV S Pro 65-inch, Xiaomi TV S Pro 75-inch, Xiaomi Sound Speaker, Xiaomi Smart Camera 3 Pro డిసెంబర్ నుండి HyperOSని పొందుతాయి.

హైపర్‌ఓఎస్ అక్టోబర్ 26న రాత్రి 10 గంటలకు చైనాలో లాంచ్ కాగా, 2024లో అంతర్జాతీయ మార్కెట్‌కు హైపర్‌ఓఎస్ విడుదల కానుందని కూడా తెలిపింది.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.